బెడిసిన సిఎం సిద్దూ వ్యూహం

లింగాయత్‌లకు ప్రత్యేక మతం పేరుతో చేసిన ప్రయత్నాలు విఫలం
బెంగళూరు,మే16(జ‌నం సాక్షి):  లింగాయత్‌లకు ¬దా కల్పించడంతో పాటు, ఆ వర్గానికి పథకాలు ప్రకటించడం ద్వారా ఆ వర్గం ఓట్లు కొల్లగొట్టాలని సిద్దరామయ్య వేసిన పథకం కాంగ్రెస్‌ పార్టీకి పూర్తిగా బెడిసికొట్టిందని కర్నాటక ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. లింగాయత్‌లను బుట్టలో వేసుకోవాలన్న వ్యూహం దెబ్బతింది. దీంతో ఇప్పుడు సిద్ధరామయ్య తాయిలాలకు లింగాయత్‌లు ఆశపడలేదని, వారు బిజెపితోనే ఉన్నారని ఈ వర్గం ప్రాబల్యం ఉన్న బాంబే కర్నాటక ఫలితాలను విశ్లేషిస్తే స్పష్టమవుతుంది. లింగాయత్‌లలో బలమైన నాయకుడయిన యెడ్యూరప్పను ప్రస్తుతం బిజెపి సిఎం అభ్యర్థిగా ప్రకటించడంతో మరోసారి లింగాయత్‌లు ఆ పార్టీకి పెట్టని కోటగా నిలిచారు. యెడ్యూరప్ప బిజెపితో విభేదించి సొంత పార్టీ పెట్టడం, బిజెపి, ఆయన పార్టీ విడివిడిగా పోటీ చేయడం 2013 అసెంబ్లీ ఎన్నికల్లో బాంబే కర్నాటకలో కాంగ్రెస్‌ పార్టీకి బాగా కలిసి వచ్చింది. అప్పుడు ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌కు 31స్థానాలు లభించగా, బిజెపికి 13 సీట్లు మాత్రమే దక్కాయి. అయితే ఈ సారి ఈ ప్రాంతంలోని మొత్త 50 స్థానాలకు గానూ బిజెపి 30 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్‌కు 17 సీట్లు మాత్రమే దక్కాయి. బాదామి నియోజక వర్గంలో ప్రస్తుత  సిద్ధరామయ్య అతి కష్టం విూద గెలిచారు. గాలి సోదరులకు సన్నిహితుడు, బిజెపి ఎంపి బి శ్రీరాములు ఈ నియోజకవర్గంలో ఆయనకు గట్టి పోటీ ఇచ్చారు. ఫలితంగా సిద్ధరామయ్య కేవలం 1696 ఓట్ల తేడాతో విజయం సాధించాల్సి వచ్చింది. ఈ నియోజక వర్గంలో 50 వేలకు పైగా లింగాయత్‌ ఓటర్లున్నారు. మరాఠాలు, ఒకప్పటి నిజాం పాలిత ప్రాంతాలు సైతం బిజెపివైపే మొగ్గు చూపాయి. నిజానికి లింగాయత్‌లకు మైనారిటీ ¬దా కల్పించడం అంశాన్ని లేవనెత్తి కాంగ్రెస్‌ పార్టీ చేతులు కాల్చుకుందని ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలకు ముందు ఈ స మప్యను లేవనెత్తి ఉండాల్సింది కాదని క ర్నాటక సీనియర్‌ నేత, మాజీ కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ అభిప్రాయ పడ్డారు. ‘మేము కుల సవిూకరణాలను సరి గా అంచనా వేయలేకపోయామనిపిస్తుంది. అవసరం లేని సమయంలో లింగాయత్‌ల సమస్య అనే నిప్పులో చేయి పెట్టామేమోననిపిస్తుంది’ అని మొయిలీ అన్నారు. మొత్తానికి హంగ్‌తో ఇప్పుడు అందరూ ఎక్కడెక్కడ తప్పులో కాలేసామా అన్న విశ్లేషణలో పడ్డారు.