బెయిల్‌ వచ్చినా ..విదేశాలకు వెళ్లలేడుగా..

శశిథరూర్‌పై స్వామి అనుచిత వ్యాఖ్యలు

న్యూఢిల్లీ,జూలై5(జ‌నం సాక్షి): ఎప్పుడూ ఇతర నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే భాజపా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, తాజాగా ఆయన కాంగ్రెస్‌ నేత, మాజీ కేంద్రమంత్రి శశి థరూర్‌ను ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన భార్య సునంద పుష్కర్‌ మృతి కేసులో శశి థరూర్‌కు దిల్లీ కోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసినా విదేశాలకు వెళల్‌ఇ తన ప్రియురాళ్లను కలుసుకునే అవకౄవం లేదని అన్నారు. ఆయనకు బెయిల్‌ వచ్చింది కానీ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి లేదు. విదేశాల్లో ఉన్న తన ప్రియురాళ్లను కూడా కలవలేరు’ అని వెల్లడించారు. ఇందులో శశి థరూర్‌కు వేడుక చేసుకునేంత విషయమేవిూ లేదు! అయినా థరూర్‌ తిహార్‌ జైల్‌ నుంచి బెయిల్‌పై విడుదల కాలేదని కావాలంటే.. బెయిల్‌వాలాలు అయిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీలతో కలిసి కూర్చోవచ్చని వ్యాఖ్యానించారు. 2014 జనవరి 17న దిల్లీలోని ఓ ఫైవ్‌ స్టార్‌ ¬టల్‌లో సునంద పుష్కర్‌ మృతదేహం లభ్యమైంది. అంతకుముందు రెండు రోజుల క్రితమే పుష్కర్‌ తన భర్త థరూర్‌కు, పాకిస్థాన్‌ జర్నలిస్ట్‌తో సంబంధం ఉందని నిందిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. పుష్కర్‌ మరణించడానికి కొన్ని రోజుల ముందు థరూర్‌ ఆమె ఫోన్‌కాల్స్‌ను నిర్లక్ష్యం చేశాడని, ఫోన్‌ చేస్తే కట్‌ చేశారని అందువల్లే ఆమె సోషల్‌ విూడియాలో పోస్ట్‌ చేశారని పుష్కర్‌ మృతి కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు వెల్లడించారు. థరూర్‌పై… సునందను ఆత్మహత్యకు ప్రేరేపించారని, హింసించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.