బెల్ట్’ జోరు… పల్లెల్లో ‘హోరు’ – గ్రామాల్లో జోరుగా మందు విక్రయాలు – పచ్చని సంసారాల్లో మద్యం చిచ్చు – ఊరూరా వెలుస్తున్న దుకాణాలు – గ్రామానికి నాలుగైదుకుపైగానే…

గంగారం జూన్ 13 (జనం సాక్షి)
మద్యం పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతోంది. ఊరూరా బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. దీంతో సామాన్యులు పొద్దంతా పని చేసి సంపాదించిన సొమ్మును మద్యానికి వెచ్చిస్తూ కుటుంబాలను వీధిన పడేస్తున్నారు. మండలంలో బెల్టు షాపుల దందా ‘మూడు బాటిళ్లు.. ఆరు కాసులు’గా తయారైంది. ఈ దందా దర్జాగా సాగుతోంది.
మండలంలో  గంగా వైన్స్‌కు సంబంధించి ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటలు వరకు అమ్మకాలు చేపట్టాలి అనే నిబంధనలు విధించారు.
ఇవి కాకుండా బయట ఎక్కడపడితే అక్కడ మద్యం విక్రయించరాదని ఆదేశాలున్నాయి. అయినా ఆ నిబంధనలు నిర్వాహకులు  పాటించడం లేదని తెలుస్తోంది. దీంతో మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి.  గ్రామాల్లో బెల్టు షాపులు అందుబాటులో ఉండడంతో పొద్దంతా కష్టపడి పనిచేసి సంపాదించిన కూలి డబ్బులతో మద్యం తాగుతూ సంసారాలను పాడు చేసుకుంటున్నారు
సంపాదన మద్యానికి ఖర్చు చేస్తుండడంతో వారి కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. మద్యానికి బానిసలైన కొందరు ఏ పని చేయకుండా ఉదయాన్నే బెల్టు షాపులకు చేరుకొని ఉద్దెర పెట్టి అప్పుల పాలవుతున్నారు.
పేరుకే కిరాణం.. అమ్మేది మద్యమే..
అనేక మంది పేరుకు కిరాణ దుకాణాలు నిర్వహిస్తూ లోపల మాత్రం మద్యం వ్యాపారం చేస్తున్నారు. గ్రామాల్లో రాత్రయితే అక్కడ పండుగ వాతావరణంలా కనపడుతూ చుట్టు పక్కల ఉన్న కాలనీ వాసులకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంకా గ్రామం లోపలికి వెళ్తే కిరాణ దుకాణాల్లో, సొంత ఇళ్లల్లో పెద్ద పెద్ద ఫ్రిడ్జ్‌లు పెట్టుకొని మరీ విక్రయిస్తుండడం కనిపిస్తాయి.
మద్యం మత్తులో అక్కడే ఇళ్ల మద్యలో గొడవలు పడుతూ అర్ధరాత్రి వరకు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని గ్రామస్తులు అరోపిస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో కిరాణ దుకాణాల్లో బెల్టు షాపులు నిర్వహిస్తూ జనాల దగ్గర బాగానే డబ్బులు సంపాదిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇంచుమించూ ప్రతి గ్రామంలో మద్యం దుకాణాలు వెలిసి ఊరంతా ఏరులై పారుతుందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇక్కడ యువత పూర్తిగా మద్యం మత్తులో బానిసలై బంగారు భవిష్యత్తుని కోల్పోతున్నారని యువతే నేటి ప్రపంచానికి పునాది అనే పదానికి పూర్తిగా విరుద్ధంగా యువత మద్యం మత్తులో         ఊగుతున్నారని స్థానికంగా ఉన్న గంగా వైన్స్ యాజమాన్యం మాత్రం మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తూ మద్యం ప్రియుల జేబులకు చిల్లులు పడేలా అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు
Attachments area