బై గణేశ..ప్రశాంతంగా ముగిసిన నిమజ్జనాలు
ఎల్లారెడ్డి-సెప్టెంబర్-24(జనం
ఎల్లారెడ్డి:డివిజన్ పరిధిలో ప్రతిష్ఠించిన గణానాధుడు సోమవారం నిమజ్జనాలు కోలాహలంగా సాగాయి.ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంతో పాటు ఆయా గ్రామలలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పదకొండు రోజుల మహా ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమలను ఆదివారం నిమజ్జన కార్యక్రమం చేపట్టారు.నిర్వాహకులు భారీస్థాయిలో అందంగా అలంకరించి శోభాయాత్ర నిర్వహించారు.దీంతో మండల కేంద్రంలో శోభాయాత్ర కనుల పండువగా కొనసాగింది.భక్తుల సౌకర్థ్యర్థం నిర్వాహకులు ప్రత్యేక శిబిరాల వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు.దీంతో మండల కేంద్రంలో ఉత్సవాలు సంబరాలు అంబరంటుకున్నాయి.ఈ సందర్భంగా యువతీలు శోభాయాత్రకు మంగళహరతులు పట్టారు.నిమజ్జనంలో సందర్భంగా ఎల్లారెడ్డి డిస్పీ చంద్రశేఖర్ గౌడ్ దగ్గరుండి పరిస్థితిని పరిశీలించారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎస్సై జి.నరేష్ నాయక్,పోలీస్ సిబ్బంది సుదీర్ నాయక్,ఓంకార్ నాయక్,ప్రవీణ్ కుమార్, రాజునాయక్,మోతిలల్ తదితరులు ఉన్నారు.