బోడు, కొప్పురాయిలో కొమరం భీమ్ జయంతి వేడుకలు

టేకులపల్లి, అక్టోబర్ 22 (జనం సాక్షి ): టేకులపల్లి మండలంలోని బోడు, కొప్పురాయి గ్రామాలలో ఆదివాసి గిరిజనులు కొమరం భీమ్ జయంతి సందర్భంగా శనివారం భీమ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి జయంతి వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బోడు గ్రామపంచాయతీ సర్పంచ్ ఇరఫా లక్ష్మీనారాయణ, కుంజ సాంబయ్య దొర, పటేల్ మాడే బాబు, వార్డు మెంబర్ కుంజ పాపమ్మ, యువకులు మాడే ప్రదీప్, కుంజ శివ, కుంజ కళావతి, కల్తి రాంబాయి, కల్తి చంద్రశేఖర్, కుంజ సూరయ్య, కుంజ రాంప్రసాద్,శివప్రసాద్, గడ్డం సంతోష్, కల్తీ పవన్,పాయం రత్నం,ఈసాల రవి, కుంజ సుకన్య,పోదెం సతీష్,పోదెం సుదీర్,మాడే చంద్రశేఖర్, మాడే కోటేశ్వరరావు, కల్తీ పవన్, జారే హనుమంతు, జారే లక్ష్మయ్య, జోగా శ్రీను, జారే గూటయ్య, జారే సరస్వతి తదితరులు పాల్గొన్నారు.