*బోనమెత్తిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు*
కొడకండ్ల, ఆగస్ట్10(జనం సాక్షి):
కొడకండ్ల మండలం రంగాపురం గ్రామంలో ముత్యాలమ్మ తల్లీ దేవాలయంలో బోనాల ఉత్సవాలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై స్థానిక సర్పంచ్ వల్లూరి సైదులు ఆధ్వర్యంలో మహిళలతో కలిసి ముత్యాలమ్మ తల్లి బోనం ఎత్తారు.అనంతరం ప్రజాప్రతినిధులు మరియు ప్రజలతో కలిసి ముత్యాలమ్మ తల్లీనీ దర్శించుకుని గ్రామస్థులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు,యూత్ నాయకులు,కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.