బ్జడెట్‌పై భిన్న స్వరాలు

బాగుందన్న రాజ్‌నాథ్‌..పెదవి విరిచిన సోనియా
న్యూఢిల్లీ,ఫిబ్రవరి28 :కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ శనివారం పార్లమెంట్‌లో బ్జడెట్‌ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పలువురు నేతలు దానిపై స్పందించారు. ఇది ప్రగతిశీల బ్జడెట్‌ ముందు చూపుతో భవిష్యత్‌ అవసరాల్ని తీర్చేలా బ్జడెట్‌ను రూపొందించారని కేంద్ర ¬ంమంత్రి రాజనాథ్‌ సింగ్‌ అన్నారు. సామాజిక భద్రత, పేదల అభ్యుతన్నతికి వూతాన్నిదచ్చేదిగా ఉంది. రైల్వే, ఆర్థిక బ్జడెట్‌లు ప్రస్తుత భారతావనికి కాల్సిన వాటి పైనే దృష్టి సారించాయి. అన్ని రంగాలకు సమ ప్రాధాన్యం ఇచ్చాయి. నల్ల ధనంపై మా నిబద్ధత బ్జడెట్‌లో బహిర్గతమైంది. భారత ఆర్థిక వ్యవస్థ త్వరలోనే గాడిలో పడుతుంది. మంచి బ్జడెట్‌ రూపొందించిన ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి అభినందనలని అన్నారు.  బ్జడెట్‌ నిరాశాజనకంగా ఉందని ఎఐసిసి అధ్యక్షురాలు  సోనియా వ్యాఖ్యానించారు. బ్జడెట్‌ నిరాశాజనకంగా ఉందని, బడా కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా దాన్ని తయారు చేశారు. ఇది పేదల వ్యతిరేక బ్జడెట్‌ అని అన్నారు.ఎన్డీఏ బడ్జెట్‌పై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పేదల వ్యతిరేక బడ్జెట్‌ అని మండిపడ్డారు. బడ్జెట్‌ ఆశాజనకంగా లేదని తెలిపారు. బడా కార్పోరేట్‌లకు మేలు చేసేలా బడ్జెట్‌ ఉందని పేర్కొన్నారు. ఎన్డీఏ బడ్జెట్‌పై మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ స్పందించారు. రూ. 17 లక్షల కోట్ల బడ్జెట్‌లో రూ. 15 వేల కోట్ల ట్యాక్స్‌ తగ్గింపులు మాత్రమే చేశారని చెప్పారు. పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బ్జడెట్‌ పేదల వ్యతిరేక బ్జడెట్‌ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి శశిథరూర్‌ విమర్శించారు. వారి అభ్యున్నతికి ఎలాంటి చర్యలూ చేపట్టలేదన్నారు. కేవలం మాటలు, ప్రమాణాలతో బ్జడెట్‌ను రూపొందించారన్నారు.  కేంద్ర ప్రభుత్వం లోక్‌ సభలో ప్రవేశ పెట్టిన  బడ్జెట్‌ నిరాశపరిచిందని టిఆర్‌ ఎస్‌ ఎంపి కవిత అన్నారు. ప్రధాని ప్రసంగాల కోసమే రైతులను వాడుకుంటున్నారు తప్ప రైతుల కోసం బడ్జెట్‌ ఏవిూ చేయలేదన్నారు. కార్పొరేట్లకు అనుకూలంగా పన్ను శాతం తగ్గించారన్నారు. నిర్భయ ఫండ్‌ కు రూ.వెయ్యి కోట్లు ఇవ్వడం సిగ్గు చేటన్నారు. ఐసీడీఎస్‌ పనులను సగానికి తగ్గించడం సరికాదన్నారు. మరో వైపు నల్లధనం పై చట్టం తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.కేంద్ర మంత్రి లోక్‌ సభలో ప్రవేశ పెట్టిన సాధారణ బడ్జెట్‌ సంతృప్తికరంగా ఉందని టిఆర్‌ ఎస్‌ ఎంపి కే.కేశవరావు అన్నారు. విబజన చట్టం హావిూలను నెరవేరుస్తామనడం సంతోషకరం అని తెలిపారు.