బ్యాంకర్లు వంద శాతం రుణాలను అందించాలి

అదనపు కలెక్టర్ వి. చంద్ర శేఖర్
నల్గొండ బ్యూరో. జనం సాక్షి
     నిర్దేశించిన లక్ష్యం మేరకు 2022-23 సంవత్సరంలో ప్రాధాన్యత రంగాలకు వంద శాంతం రుణాలు అందించి పూర్తి లక్ష్యాన్ని సాధించాలని బ్యాంకర్లకు అదనపు కలెక్టర్ కలెక్టర్ వి.చంద్ర శేఖర్ సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరములో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన బ్యాంకర్లు, సంక్షేమ శాఖ అధికారులతో డిసిసి, డి.యల్ ఆర్సి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగినది.  ఈ సందర్బంగా గత సంవత్సరం 2021-22 వార్షిక రుణ ప్రణాళిక ద్వారా జిల్లాలో మొత్తం  రుణాలు రూ.7303 కోట్ల 57 లక్షలు  లక్ష్యం కాగా, రూ.5942 కోట్ల రుణాలు అందించి 81.36 శాంతం లక్ష్యం సాధించడం జరిగిందన్నారు.  పంట రుణాలు వానా కాలం(ఖరీఫ్) లో రూ.2038 కోట్ల రుణాల లక్ష్యం కాగా, 1832 కోట్ల రుణాలు అందించి 79.38 శాంతం లక్ష్యం సాధించడం జరిగిందన్నారు.  యాసంగి (రబీ) లో రూ. 1540 కోట్ల 70 లక్షల లక్ష్యానికి గా ను1340  కోట్ల 87 లక్షలు  రుణాలు అందించి 87.03 శాంతం లక్ష్యం సాధించామని తెలిపారు.  అగ్రి టర్మ్ లోన్ క్రింద రూ. 485 కొట్ల 34 లక్షల లక్ష్యం   గాను 407 కోట్ల 78 లక్షలు  రుణాలు అందించి 84.02 శాతం, సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలకు రూ. 645  కోట్ల85 లక్షలు కు గాను రూ. 602 కోట్ల 45 లక్షలు రుణాలు అందించి 93.28 శాతం లక్ష్యం సాధించడం జరిగిందని తెలిపారు
*2022-23 వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణ*
      2022-23 సంవత్సరానికి గాను వార్షిక ఋణ ప్రణాళికను రూ. 8091 కోట్ల 88 లక్షల రూ.లు లక్ష్యంగా వార్షిక ఋణ ప్రణాళికను అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ విడుదల చేశారు.  ప్రాధాన్యత రంగాలకు రూ. 7655 కోట్ల 66 లక్షలు ప్రాధాన్యేతర రంగాలకు రూ. 436 కోట్ల 22 లక్షలు చొప్పున మొత్తం రూ. 8091కోట్ల 88 లక్షల లక్ష్యాన్ని 2022-23 సంవత్సరానికి నిర్దేశించినారు.  ఇందులో  వ్యవసాయ రుణాలు క్రింద రూ.6479 కోట్ల 14 లక్షలు , చిన్న, సూక్ష్మ, మధ్యతరగతి పరిశ్రమలకు 752 కోట్లు, విద్యా రుణాల క్రింద 59 కోట్ల20 లక్షలు లక్ష్యం నిర్దేశించారు. గృహ రుణాల కింద 266 కోట్లు రూ.లు కేటాయించారు.  వివిధ శాఖల కింద ఆయా పథకాలు,బ్యాంకు వారీగా వచ్చే సమావేశం లో సాధించిన ప్రగతి సమీక్షించనున్నట్లు,బ్యాంకర్ లు బ్రాంచ్ వారీ గా పూర్తి వివరాల తో హాజరు కావాలని అన్నారు.అర్హులైన లబ్ధిదారులకు రుణాలు అందించాలని,నేషనల్  లైవ్ స్టాక్ మిషన్ స్కీం కింద గ్రామీణ ప్రాంతం లో పశు సంబంధిత డైరీ,గొర్రెల యూనిట్ లు పెద్ద సంఖ్యలో రుణం అందించి ప్రోత్సహించాలని,అలాగే పి.యం. ఈ.జి.పి.కింద పరిశ్రమల స్థాపనకు నిరుద్యోగులకు రుణం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో లీడ్ మేనేజర్ సూర్యం,ఎస్.బి. ఐ చీఫ్ మేనేజర్ మురళి కృష్ణ,అర్.బి. ఐ. ఏ.జి.యం.తేజ దిప్త బెహ్రా, డి.అర్.డి. ఓ. కాళిందిని,ఎస్.సి.కార్పొరేషన్ ఈ.డి.వెంకటేశం, సంక్షేమ శాఖల అధికారులు, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు