బ్యాక్ టు స్కూల్ బకెట్ చాలెంజ్ లో బాగంగా జ్యోతినగర్ లోని వాచ్మెన్ కుటుంబాల పిల్లలకు నోట్బుక్స్ పంపిణీ…
పేద పిల్లల చదువు కోసం 6 సం.క్రింద శ్రీ సేవా మార్గ్ సంస్థ ద్వారా చేపట్టిన “బ్యాక్ టు స్కూల్ బకెట్ చాలెంజ్ ” లో బాగంగా ఈ రోజు జ్యోతినగర్ లోని దాదాపు 25 అపార్ట్మెంట్ లలో వాచ్మెన్ లు గా పనిచేస్తున్న వారి పిల్లలకు సంస్థ ద్వారా నోట్ బుక్స్ ని పంపిణీ చేయడం జరిగింది.
సంస్థ అధ్యక్షురాలు మునిపల్లి.ఫణిత మాట్లాడుతూ కోవిడ్ వలన వాచ్ మెన్ కుటుంబాలు ఆర్థికంగా చితికి పోవడంతో పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు ఇస్తున్నప్పటికీ నోట్ పుస్తకాలు కొనే పరిస్థితి లేదని ,సంస్థ ప్రతినిధుల కు తెలుపగా ఈ రోజు అపార్ట్మెంట్ లలో పనిచేస్తున్న 40 మంది పిల్లలకు 250 నోట్ బుక్స్ ని అందించడం జరిగింది అని తెలిపారు .
ఈ సంవత్సరం ఈ చాలెంజ్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో, మురికి వాడలలో మరియు అనాధ ఆశ్రమంలో ఉన్న పేద పిల్లలందరికీ ఉచితంగా నోట్స్ ని అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షురాలు మునిపల్లి.ఫణిత, సంస్థ ప్రతినిధులు మరియు జ్యోతినగర్ లో ని వాచ్మెన్ కుటుంబాలు వారి పిల్లలు పాల్గొన్నారు.