బ్యూటీ బిజినెస్‌లోకి టెన్నిస్ బ్యూటీ
లండన్, జూన్ 22 (జనంసాక్షి):
ప్రపంచ టెన్నిస్‌లో తన ఆట కన్నా అందంతోనే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్న రష్యన్ బ్యూటీ మరియా షరపోవా ఇప్పుడు వ్యాపారాలలోనూ దూసుకు పోతోంది. గత ఏడాది షుగర్‌పోవా పేరుతో క్యాండీలను ప్రారంభించి అందరి దృష్టినీ ఆకర్షించిన షరపోవా వేరే బిజినెస్‌లలోకి కూడా అడుగుపెడుతోంది. త్వరలో కాస్మోటిక్స్, ఫ్యాషన్ మార్కెట్స్‌లోకి ఎంటరవనున్నట్టు చెప్పింది. తన క్యాండీ బిజినెస్ ప్రమోషన్‌లో భాగంగా లండన్‌లో సందడి చేస్తోన్న ఈ టెన్నిస్ బ్యూటీ తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి వివరించింది. కాస్మోటిక్స్, ఫ్యాషన్‌లకు ఎంతో ప్రాధాన్యత ఉందని, వాటిలో కూడా బిజినెస్ ప్లాన్స్ చేయనున్నట్టు తెలిపింది. ఫ్యాషన్‌కు అసలైన చిరునామాగా భావించే ఈ రష్యన్ స్టార్ ప్రతీ టోర్నీలో ఏదో ఒక ప్రత్యేక అలంకరణతో కనబడుతుంటుంది. కాలికి వేసుకునే షూ నుండి చెవికి పెట్టుకునే రింగ్ వరకూ స్పెషల్ కేర్ తీసుకుంటుంది. కొత్త కొత్త ఫ్యాషన్ అంటే తనకు చాలా ఇష్టమని, ఈ బిజినెస్ ద్వారా తన ఆలోచనలకు రూపకల్పన చేస్తానని చెప్పింది. ముఖ్యంగా డ్రెస్ డిజైనింగ్‌లో కొత్త కొత్త వెరైటీలు ప్రవేశపెట్టే ఆలోచన ఉందని తెలిపింది. ఇకపై ఈ టెన్నిస్ బ్యూటీ… తన ఫ్యాషన్ టిప్స్‌తో బ్యూటీ బిజినెస్‌లో కూడా సందడి చేయనుందన్న మాట.