బ్రహ్మంగారి మఠం బస్సును పునరద్దురించాలి
కొమరోలు, జూలై 18 : పొదిలి ఆర్టీసి డిపోకు చెందిన కందిమల్లయ్యపాలెంకు గతంలో పొదిలి డిపో పుట్టినప్పటి నుండి ఉన్న బస్సు రెండు నెలల నుంచి బస్సు భక్తులకు తెలియకుండా రద్దు చేశారు. కంభం, పొదిలి, బేస్తవారిపేట, కొమరోలు నుంచి ప్రతిరోజు అనునిత్యం బ్రహ్మంగారి మఠానికి భక్తులు అధిక సంఖ్యలో వెళ్తుంటారు. దశాబ్ధకాలానికి మఠానికి బస్సు ప్రతిపాదనలు ఉన్నదని, ఆ బస్సును రద్దు చేయడం పట్ల భక్తులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ బస్సును తిరిగి పునరుద్దరించి ప్రైవేశపెట్టడం ఎంతో మంచిదని అన్నార. గతంలో కృషి చేసిన నాయకులు అప్పటి మాజీ ఎమ్మెల్యే చప్పిడి వెంగయ్య కృషి వలన బస్సు సర్వీసు సాధించినట్లు తెలిపారు. ఇప్పటికే భక్తులు బ్రహ్మంగారిని దర్శించుకోలేక ఆందోళన చెందుతున్నారు. వెంనే ఈ సర్వీసును పునరుద్దరించి భక్తులకు సౌకర్యాలు మెరుగుపడే విధంగా ఉండాలని కోరుకుంటున్నారు.