బ్రిడ్జి పైనుంచి కిందపడ్డ లారీ డ్రైవర్ మృతి
ఖమ్మం జిల్లా వైరా మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి కిందపడిపోవడంతో.. అందులోని డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. క్లీనర్ కు తీవ్ర గాయాలు కాగా.. ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. డ్రైవర్ మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం కోసం తరలించారు.