*భక్తిశ్రద్ధలతో జగదాంబ మాతకి ప్రత్యేక పూజలు

లింగంపేట్ 23 ఆగస్టు (జనంసాక్షి)
లింగంపేట్ మండలంలోని కన్నాపూర్ తాండలో మంగళవారం తాండ వాసులు జగదాంబ మాతకి ప్రత్యేక పూజలు నిర్వహించారు.శ్రావణ మాసం పురస్కరించుకొని గత ఐదు వారాలుగా ఉపవాసం ఉన్న తండావాసులు మంగళవారం ఉపవాసాలు వదిలి జగదాంబ మాత,సేవలాల్ మహరాజ్, రామ్ రాజ్ మహరాజ్ కు క్తి శ్రద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు.అనంతరం నృత్యాలు చేస్తూ ఆనందంగా ఒక్క పొద్దులు వదిలారు.ఈ కార్యక్రమంలో గిరిజన మహిళలు తాండ వాసులు సర్పంచ్ గోవింద్,శంకర్ నాయక్,శివలాల్ పీర్సింసింగ్,రమేష్ తదితరులు పాల్గొన్నారు