భగత్ సింగ్ చరిత్ర పాఠ్యాంశాల్లో చేర్చాలి

సిపిఐ జిల్లా కార్యదర్శి కె విజయరాములు

వనపర్తి సెప్టెంబర్ 28 (జనం సాక్షి)దేశ ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చాలని ఉరికొయ్య పై ఊపిరులు వదిలిన షహిద్ భగత్ సింగ్ జీవిత చరిత్రను జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కె విజయరాములు డిమాండ్ చేశారు బుధవారం వనపర్తి జిల్లా కేంద్రం సిపిఐ కార్యాలయంలో షహిద్ భగత్ సింగ్ 115 వ జయంతిని ఘనంగా నిర్వహించారు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 23 ఏళ్ల చిన్న వయసులో జీవితాన్ని దేశానికి అంకితం చేసిన భగత్సింగ్ కంటే గొప్పవారు ఎవరని ప్రశ్నించారు ఇంత పిన్న వయసులో అంతటి త్యాగం చేసిన వారు స్వాతంత్ర సమరంలో కనబడరన్నారు ఆయన చరిత్ర పాఠ్యాంశాల్లో చేర్చటం వల్ల దేశం కోసం ఆయన త్యాగం దేశభక్తి యువకుల్లో పాదుకుంటుందన్నారు అంతేగాక ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించాలన్నారు ఈ కార్యక్రమంలో భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు పి కళావతమ్మ ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కే శ్రీరామ్ కార్యదర్శి మోష మహిళా సంఘం సభ్యులు వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు