భద్రతా ప్రమాణాలు పాటించని దుకాణాలపై చర్యలు తప్పవు
హుజూర్ నగర్ అక్టోబర్ 23 (జనం సాక్షి): టపాసులు అమ్మే దుకాణాల యజమానులు భధ్రతా ప్రమాణాలు పాటించని దుకాణాలపై చర్యలు తప్పవని హుజూర్నగర్ ఎస్సై కట్టా వెంకటరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటరెడ్డి మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వ అనుమతి పొంది క్రాకర్స్, స్టాల్స్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని లేనట్లయితే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతీ దుకాణం ముందు ఇసుక బకెట్ లు, వాటర్ డ్రమ్ము, ఫైర్ సేఫ్టీ సిలిండర్ పెట్టుకోవాలన్నారు. దుకాణాలకు, దుకాణాలకు మధ్య దూరం పాటించాలన్నారు. అగ్ని ప్రమాదం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పట్టణ ప్రజలు తమ ఇంటివద్ద తగిన జాగ్రత్తలు పాటిస్తూ టపాసులు కాల్చుకోవాలి, పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో మాత్రమే టపాసులు కాల్చుకోగలరని సూచించారు. ప్రతి ఒక్కరూ వెలుగుల పండుగ దీపావళి ని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలన్నారు. పట్టణ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.