భద్రాచలం కేంద్రంగా ఆదివాసీ జిల్లా ఏర్పాటు చేయాలి
ఖమ్మం, సెప్టెంబరు 19 : భద్రాచలం కేంద్రంగా ఆదివాసీ జిల్లా ఏర్పాటు చేయాలని జీఎస్‌పీ కన్వీనర్ సోందే వీరయ్య డిమాండు చేశారు. కొత్తగూడెంలో గనులున్నందున అక్కడ జిల్లా చేస్తే ప్రమాదమని ఆయన పేర్కొన్నారు. గిరిజనులను దృష్టిలో పెట్టుకొని భద్రాచలాన్ని జిల్లాగా చేయాలని కోరుతూ ఐటీడీఏ గవర్నింగ్‌బాడీ సమావేశంలో తీర్మానం చేయాలని ఆయన డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో పలు గిరిజన సంఘాల నేతలు పాల్గొన్నారు.