భద్రాద్రి ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు: కేసీఆర్
భద్రాచలం: భద్రాద్రి రామాలయంలో శ్రీరామనవమి వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ యాదాద్రి తరహాలో భద్రాద్రిని అభివృద్ధి చేస్తామని తెలిపారు. భద్రాద్రి ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తామని సీఎం చెప్పారు. భద్రాద్రి ఆలయ అభివృద్ధిపై చినజీయర్‌స్వామితో చర్చిస్తామని తెలిపారు. జిల్లాకు రెండు సాగునీటి ప్రాజెక్టులు మంజూరు చేశామని కేసీఆర్ గుర్తు చేశారు.