భద్రాద్రి ఏజెన్సీ ప్రాంతంలో దొంగనోట్ల కలకలం. *ఆదివాసులను అండగా చేసుకొని దొంగనోట్ల చలామణి. *దొంగనోట్ల ముఠా గుట్టు రట్టు. *ఎనిమిది మంది నిందితులను పట్టుకున్న పోలీసులు. *వివరాలు తెలిపిన భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజు.
భద్రాచలం, జూన్ 7 (జనం సాక్షి): భద్రాచలం మన్యం చర్ల మండలం దొంగనోట్ల కలకలం రేగింది. అమాయక ప్రజలను మోసం చేస్తూ నకిలీ నోట్లను అంటకాగుతున్న నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టయింది. ఈ మోసానికి పాల్పడుతున్న వివిధ ప్రాంతాలకు చెందిన 8 మంది వ్యక్తులను భద్రాచలం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇందుకు సంబంధించి భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజ్ మంగళవారం విలేకరుల సమావేశంలో పలు విషయాలు వెల్లడించారు అమాయక ఆదివాసులు లక్ష్యంగా చేసుకుని నకిలీ నోట్లను ముద్రించి వారిద్వారా చలామణి చేస్తున్న ఎనిమిది మంది వ్యక్తులను ను అదుపులోకి తీసుకున్నట్టు ఏ ఎస్పి వెల్లడించారు. ఈ ఘటనలో చర్ల మండలం తేడా గ్రామానికి చెందిన సిరిగిరి నగేష్, కలివేరు గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్, గుంటూరు జిల్లా తెనాలి మండలానికి చెందిన మల్లెల వినోద్ కుమార్, కొత్తపెళ్లి జీవరత్నం, గుంటూరు ఆర్టీసీ కాలనీకి చెందిన పబ్బటీ జయలక్ష్మి, చర్ల కు చెందిన సయ్యద్ ఇక్బాల్, మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గుమ్మాల సర్వేశ్వరరావు లతో పాటు మరో మైనర్ బాలులను అదుపులోకి తీసుకున్నట్టు ఏఎస్పి తెలిపారు. చల్లా లో గత కొద్ది రోజులుగా అమాయక ఆదివాసి ఇ ప్రజలను మోసం చేసి డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీరంతా ఒక ముఠాగా ఏర్పడి నకిలీ కరెన్సీ నోట్లను చాలామంది చేస్తూ ఉండగా పోలీసులు పట్టుకోవడం జరిగిందని ఆయన వెల్లడించారు. వీరంతా చర్ల, చతిస్గడ్ సరిహద్దు ఆదివాసి గ్రామాల నుంచి చర్ల సంతకు, కూలి పనులకు వచ్చే ఆదివాసులు లక్ష్యంగా నకిలీ కరెన్సీ నోట్లను చలామణి చేస్తున్నారని తెలిపారు. గుంటూరుకు చెందిన పబ్బటీ కృష్ణ తో కలిసి వినోద్ కుమార్, జీవరత్నం దొంగ నోట్లు ముద్రించి నగేష్, ప్రేమ్ కుమార్ లకు ఇస్తే వాటిని వారు చర్ల మండలంలో చలామణి చేస్తున్నారని ఏ ఎస్పి పేర్కొన్నారు. పబ్బటీ మురళీ కృష్ణ ను నెల్లూరు కావలి రూరల్ పోలీస్ స్టేషన్ గత రెండు నెలల క్రితం దొంగనోట్ల కేసులో ఆయనను అరెస్టు కూడా చేయడం జరిగిందని ఏఎస్పీ పేర్కొన్నారు. పట్టుబడిన ఎనిమిది మంది వ్యక్తుల నుంచి నకిలీ నోట్లను స్వాధీనపర్చుకున్నారు. వారి దగ్గర స్వాధీనపరుచుకున్న నకిలీ నోట్లు 500 రూ నోట్లు 551 గాను, 2000 రూ నోట్లు 90 గాను, 200 రూ నోట్లు 300 గాను నకిలీ నోట్ల తయారీకి ఉపయోగించే పరికరాలు మరియు కార్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పి రోహిత్ రాజు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చర్ల సీ.ఐ అశోక్ కుమార్, చర్ల ఎస్సై మరియు సిబ్బంది పాల్గొన్నారు.