భవిత కేంద్రం లో ఫిజియోథెరపీ నిర్వహించిన ఫిజియథెరపీ డాక్టర్ అరుణ్

ఎల్లారెడ్డి 12 అక్టోబర్ జనం సాక్షి ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఉన్న భవిత సెంటర్లో బుధవారం ఫిజియోథెరపీ వైద్యులు అరుణ్ 6 గురు విద్యార్థులకు అంగవైకల్యం చెందిన పిల్లలకు వ్యాయామం నిర్వహించారు. 6 గురు పిల్లలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం అంగవైకల్యం చెందిన వారికి పలు విధాలుగా వ్యాయామం నిర్వహించి వారి తల్లిదండ్రులకు వారం రోజులపాటు వైద్యులు సూచించిన మేరకు వ్యాయామం నిర్వహించాలని వైద్యులు అంగవైకల్యం చెందిన విద్యార్థులు తల్లిదండ్రులకు తెలిపారు. వారానికి ఒకసారి నిర్వహించే ఫిజియోథెరపీ ద్వారా ఎంతో మంది పిల్లలకు ఆరోగ్యం సమకూరుతుందని ఫీజు తెరపి సెంటర్కు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు వైద్యులు చేస్తున్న వ్యాయామం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అంగవైకల్యం చెందిన పిల్లలు వారంకోసారి నిర్వహించే భవిత సెంటర్ కు రావాలని వైద్యుల అరుణ్ సూచించారు. ఈ కార్యక్రమంలో, ఫిజియోథెరపీ, ఐ ఈ ఆర్ పి, శివకుమార్, వెంకటేశం,సిబ్బంది పద్మ, అంగవైకల్యం చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ,తదితరులు పాల్గొన్నారు