భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి..!! – విద్యార్థినిలకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసిన జడ్పీటీసీ హరిప్రియ

విద్యార్థినిలు ఏకాగ్రతతో చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జడ్పీటీసీ హరిప్రియ అన్నారు. శుక్రవారం పురపాలిక పరిధిలోని ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో  విద్యార్థినిలకు పాఠ్య పుస్తకాలు, దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని వసతి గృహం వార్డెన్ చంద్రకళ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పీటీసీ హరిప్రియ, పురపాలిక చైర్మన్ ముకుంద అశోక్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతిగారి సురేందర్ కుమార్ లు హాజరై విద్యార్థినిలకు పాఠ్య పుస్తకాలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయులు బోధించే పాటలను ఏకాగ్రతతో చదువి భవిష్యత్తులో ఉన్నత స్థాయి పదవులు పొంది తమ తమ తల్లిదండ్రులకు మంచి గుర్తింపు తీసుకు రావాలని తెలిపారు. అలాగే వసతి గృహంలో భోజనం, మౌళిక సదుపాయాలు వంటి ఇబ్బందులు తలెత్తినా మా దృష్టికి తీసుకు రావాలని విద్యార్థినిలకు సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినిలు, ఉపాధ్యాయులు, వసతి గృహం నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.
———-
ఫొటో రైటప్, పరిగి, 02 : విద్యార్థినిలకు పాఠ్య పుస్తకాలు అందజేస్తున్న దృశ్యం