భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం : కోదండరాం
న్యూఢిల్లీ: అఖిలపక్ష భేటీ పరిణామాలను ప్రత్యక్షంగా పరిశీలించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరాం అన్నారు. తెలంగాణపై నిర్ణయం చెప్పడంలో కాంగ్రెస్ పార్టీదే ప్రధాన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఈ అఖిలపక్ష భేటీలో తెలంగాణపై తేల్చాలని.. లేకపోతే ఉద్యమాన్ని ఉద్థృతం చేస్తామని హెచ్చరించారు.