భాజపా అసెంబ్లీ కన్వీనర్ గా నాయిడి మురళి నియామకం

బిజెపి నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ గా నాయుడు మురళి ని రాష్ట్ర పార్టీ నిర్ణయించిందని రాష్ట్ర నాయకులు పెద్దపల్లి ఇంచార్జి రావుల రాంనాధ్ అన్నారు.ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనను  ఆపార్టీ నాయకులు పూలమాలలు, శాలువతో ఘనంగా సన్మానించారు .అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి బిజెపి రాష్ట్ర నాయకులు పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి రావుల రామనాథ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బిజెపి భయం పట్టుకున్నది నిన్న జరిగిన టిఆర్ఎస్ ఎల్పి సమావేశంలో ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరు బిజెపి వాళ్లు ఫోన్ చేసిన నాకు చెప్పాల లేకుంటే మీ అంతు చూస్తానని చెప్పి బెదిరించడం అదేవిధంగా నా కూతురు కవితను బిజెపి పార్టీ మారాలని చెప్పి ఒత్తిడి చేస్తుందని చెప్పి చిల్లర రాజకీయాలు చేస్తూ తన మీదున్నటువంటి వ్యతిరేకతను టిఆర్ఎస్ పార్టీలో అంతర్గత కొమ్ములాటలను  పెట్టుకోవడానికి బిజెపిని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నంలో కేసీఆర్ ఉన్నాడని అన్నారు.   మునుగోడులో అనుకున్న మెజార్టీ రాలేదని బిజెపి ఓట్ల శాతం పెరిగిందని టిఆర్ఎస్ పార్టీకి బిజెపి ప్రత్యామ్నాయమని తెలుసుకొని నిన్నటి వరకు రాష్ట్రంలో బిజెపి ఎక్కడుందని టిఆర్ఎస్ కాంగ్రెస్కే పోటీ అని చెప్పుకున్న కేసీఆర్ ఇప్పుడు బిజెపి ఎదుగుదలను చూసి ప్రజల ఆదరణను చూసి భయపడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీని బిజెపిని అనేక రకాలుగా తిట్టుతూ రాజకీయాలు నడుపుతున్నాడని పేర్కొన్నారు, కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీల నుండి అనేకమంది బిజెపిలోకి వలసలు పెరిగిపోతాయని భయపడి నిన్నటి సమావేశంలో బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఎద్దేవా చేసారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసిమ్మరాజు ,జిల్లా కార్యదర్శులు మిట్టపల్లి రాజేందర్ ,కొర్పెల్లి శ్రావణ్ రెడ్డి ,మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రజిని ,దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఒడిశాలర్జున్ ,కిషన్ మార్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలేటి లింగారెడ్డి, బిసి మోర్చా ప్రధాన కార్యదర్శి రాము, సీనియర్ నాయకులు డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి ,అయ్యన్న గారి రాజేందర్ ,తోట సత్యనారాయణ పట్టణ మండల కార్యకర్తలు పాల్గొన్నారు.