భానుప్రసాద్ ఆత్మహత్య పై న్యాయ విచారణ చేపట్టాలి..ఎస్ ఎఫ్ ఐ

 బాసర త్రిబుల్ ఐటీ కి చదువు కోసం కాకుండా చనిపోవడం కోసం ఆత్మహత్యల కోసం విద్యార్థులు వస్తున్నట్లు,  తమకు ఏమి సంబంధం లేనట్లు  యాజమాన్యం నిమిత్తమాత్రంగా ఉండడం చాలా అనుమానాలకు తావు ఈస్తుంది. ఈ ఆత్మహత్యలపై సమగ్ర విచారణ జరిపి కారణాలను శాస్త్రీయంగా నిర్ధారణకు రావాలి. క్యాంపస్ లో ఉన్న విద్యార్థులు ఆబ్సెంట్ అయితే ఎందుకు ఆబ్సెంట్ అయ్యారు అనే కారణాలు  చూడడం గాని వారు ఏం చేస్తున్నారు పరిశీలన చేయడం కానీ చేయడం లేదని ఈ సంఘటన నిరూపిస్తున్నాయి. సంఘటన జరిగినప్పుడు హడావిడి చేయడం  పరిష్కారం చేస్తామని హామీలు ఇవ్వడం సాధారణ పరిపాటిగా జరుగుతుంది. ఇప్పుడు ఆత్మహత్యగా చేసుకున్నారని చెబుతున్న  భాను ప్రసాద్ గతంలో బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను బయటి ప్రపంచానికి తెలియజేయడం క్యాంపస్లో సమస్యలపై అధికారులను సమస్య పరిష్కారమయ్యే వరకు ఎడతెరిపి లేకుండా ఆందోళనలకు నాయకత్వం వహించారు ఆత్మహత్య చేసుకునే అంత బలహీనమైన  మనస్తత్వం కాదు, వ్యక్తిగత సమస్యలు లేవని వారి కుటుంబ సభ్యులు తెలియజేశారు.  ఈ పరిస్థితిని గమనించి అత్యంత పేద కుటుంబం,నాలుగు సంవత్సరాల కింద తండ్రి చనిపోవడం తాను పెద్ద చదువులు చదివి ఇంటికి ఆసరా అవుతాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న కుటుంబం, విద్యార్థి సమస్య లపై నిరంతరం పని చేసే భాను ప్రసాద్   ఆత్మహత్య చేసుకొనే పరిస్థితి లు లేవు అయన మృతి పైన  అనేక అనుమానాలు ఉన్నాయి ఈ సంఘటనపై ఎవరైనా సిట్టింగ్ జడ్జి తో సమగ్ర విచారణ జరిపి నిజ నిజాలు బయటికి తీసుకురావాలని, దోషులు ఎవరైనా సరే శిక్షించాలని ఎస్ఎఫ్ఐ నిర్మల్ జిల్లా  ప్రధాన కార్యదర్శి శీతల్కర్ అరవింద్ జిల్లా ఉపాధ్యక్షులు నవీన్ లు  డిమాండ్ చేశారు.

తాజావార్తలు