భారతదేశ గొప్పతనాన్ని చాటి చెప్పేందుకు యువత ముందుండాలి

డాక్టర్ వి. ఎం అబ్రహం

జాతీయ గీతాలాపన విజయవంతం

ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 15 : యువత భారతదేశ చరిత్రపై అవగాహన కలిగి ఉండి దేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పేందుకు ముందుండాలని అలంపూరు శాసన సభ్యులు డాక్టర్ వి. ఎం అబ్రహం అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో పురస్కరించుకొని సామూహిక గీతాలాపన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఎర్రవల్లి కూడలిలో జాతీయ గీతాలాపన కార్యక్రమం అలంపూర్ వలయ అధికారి సూర్యనాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం అబ్రహం, ఎంపీపీ స్నేహ, సింగల్ విండో చైర్మన్ రంగారెడ్డి, అలంపూర్ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాందేవ్ రెడ్డి, మాజీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, సరస్వతీ స్కూలు, ఏకశీల ఇంటర్నేషనల్ స్కూలు, కస్తూర్బా గాంధీ పాఠశాల, గురుకుల పాఠశాల విద్యార్థులు భారీగా ఎర్రవల్లి చౌరస్తాకు చేరుకొని సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు 15 రోజులపాటు వజ్రోత్సవాలను నిర్వహించి, నేటి తరానికి స్వాతంత్ర ఉద్యమం గురించి స్పష్టమైన అవగాహన కలిగించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి హనుమంత్ రెడ్డి, తాహసిల్దార్ సుబ్రహ్మణ్యం, ఇటిక్యాల ఎస్సై గోకారి, ఎంఈఓ రాజు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, వ్యవసాయ కూలీలు, ప్రయాణికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

మండల కేంద్రంతో పాటు చాగాపురం, నక్కలపల్లి, ఆర్ గార్లపాడు సాసనూలు బి.వీరాపురం, షేక్ పల్లి, మునగాల, ఉదండాపురం, సాతర్ల, వావిలాల, కోదండపురం, కొండేరు, వల్లూరు, వేముల, బట్లదిన్నె, ధర్మవరం, పెద్దదిన్నె, బీచుపల్లి, పుటాన్ దొడ్డి తదితర గ్రామాలలో స్థానిక సర్పంచులు నిర్దేశించిన సమయానికి ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల తోపాటు ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గోని సామూహిక జాతీయ గీతాలాపనను విజయవంతం చేశారు.