భారత్‌పై గెలుపే లక్ష్యం


– మహేలా జయవర్ధనే

లండన్‌ : ఐసిసి చాంపియన్స్‌ ట్రోఫీ టోర్నమెంట్‌ ్నపారంభానికి భారత్‌తో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఓటమిని తామంతా మరిచిపోయామని, రెండో సెమీ ఫైనల్లో భారత్‌పై విజయం సాధించాలన్నదే తమ లక్ష్యమని శ్రీలంక స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ మహేలా జయవర్ధనే అన్నాడు. ‘ఇప్పుడు వామప్‌ మ్యాచ్‌లు లాంటివి లెక్కలోకి రావు. ఇది చాలా పెద్ద ఓన్నమెంట్‌. అంతెకాదు, ఇది సెమీఫైనల్‌. అందుకే దీని టగురించే ఆలోచిస్తాం’ అని  జయవర్దనే చెప్పాడు. సోమవారం ఓవల్‌ గ్రూప్‌-ఏలో జరిగిన చివరి మ్యాచ్‌లో శ్రీలంక ఆస్ట్రేలియాపై 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సెమీ ఫైనల్‌కు ఆర్హత సాధించిన విషయం తెలిసిందే. సెమీ ఫైనల్లో స్థానం పొందాలంటే తప్పక విజయం సాదించాల్సిన ఆ మ్యాచ్‌లో శ్రీలంక 8 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 230 పరుగులకే ఆలవుట్‌ అయింది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో జయవర్దనే 84 పరుగులతో నాటవుట్‌గా నిలిచి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ఎంపికయ్యాడు. గురువారం జరిగే రెండో సెమీ ఫైనల్లో శ్రీలంక భారత్‌ను ఢీకొంటుంది. అయితే ఈ టోర్నమెంట్‌లో భారత్‌ బ్యాటింగ్‌ చాలా బలంగా ఉన్నట్లు జయవర్దనే అంగీకరించాడు. ‘ ఈ టోర్నమెంట్‌లో టీమిండియా అద్భుతంగా  ఆడుతోంది. వాళ్ల బ్యాటింగ్‌ చాలా బలంగా ఉంది. అందువల్ల దీనిపై మేము కాన్త దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది’ అని అతను అన్నాడు. కాగా, నిన్నటి మ్యాచ్‌లో వన్‌డేలలో 11 వేల పరుగుల మైలురాయిని చేరుకోవా డం గురించి మాట్లాడు తూ, తాను ఎలాంటి అనుభూతికి లోనుకాలేద న్నాడు. మ్యాచ్‌ని గెలి చి సెమీ ఫైనల్‌కు అర్హత సాధించాం గనుక, అందులోను తాను రాణించి నందున ఇప్పుడు తాను దీని గురించి ఇప్పుడు ఆలోచిస్తానని జయవర్దనే అన్నా డు. 2002లో కొలంబోలో భార త్‌తో కలిసి ట్రోఫీని పంచుకున్న తాము ఈ టోర్నమెంట్‌ను గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నట్లు జయవర్దనే అన్నాడు. తాను ప్రతి మ్యాచ్‌ గెలవాలని అనుకుంటామని అతను అంటూ, జట్లులోని అందరికీ అలాంటి సంకల్పమే ఉంటే ఏమయినా సాధించవచ్చని అన్నాడు. అయినా టోర్నమెంట్‌ గెలవాలంటే తాము ఇంకా ఎంతో పోరాడాల్సి ఉందని అన్నాడు.