భారత్ బిడ్డ బ్రిటన్ ప్రధాని..
` బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రిషి సునాక్
` నియామించిన రాజు ఛార్లెస్`3
` ఇది అత్యంత అరుదైన సందర్భం
` ప్రజలకు సేవ చేసే అవకావం లభించింది
` ప్రజల మేలుకోసం శక్తిమేరకు కృషి చేస్తా: రుషి సునాక్
` దేశాన్నిఆర్థికంగా గట్టెక్కిస్తానని ప్రకటన
` అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ ..కలసి పనిచేద్దామని పిలుపు
లండన్(జనంసాక్షి):భారత సంతతికి చెందిన రిషిసునాక్ (42) బ్రిటన్ ప్రధాని బాధ్యతలు చేపట్టారు. ఆయనను ప్రధానిగా బ్రిటన్ రాజు చార్లెస్ `3 నియమించినట్లు ప్యాలెస్ ప్రకటించింది. ఈ మేరకు సునాక్ ఛార్లెస్‌ను కలిసారు. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన బోరిస్ జాన్సన్ ప్రధాని రేసు నుండి వైదొలగడం, పెన్నీ మోర్డాంట్‌కు తగినంత మద్దతు లభించకపోవడంతో రిషికి మార్గం సుగమమైంది. ప్రధానిగా తనకు మద్దతు ఉందని ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వాలని చార్లెస్ `3 ని రిషి కోరారు.లండన్ బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కింగ్ ఛార్లెస్`3ని కలిశారు. లిజ్ ట్రస్ ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకోవడం, రిషి సునాక్‌ను ప్రధాని బాధ్యతలు స్వీకరించడం అంతా నిమిషాల్లో జరిగిపోయాయి. అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. ఆర్థిక సంక్షోభం నుండి బయటపడేందుకు తన వంతు కృషి చేస్తానని, బ్రిటన్ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. ఆర్థిక సంక్షోభం నుండి బయటపడేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని, అద్భుతాలు సాధించగలమని అన్నారు. అంతకుముందు చార్లెస్ `3 కి లిజ్ ట్రస్ తన రాజీనామాను సమర్పించారు. 200 ఏళ్లలో బ్రిటన్ అత్యున్నత పదవిని చేపట్టిన పిన్న వయస్కుడిగా రిషి సునాక్ రికార్డు సృష్టించాడు . మాజీ ప్రధాని లిజ్‌ట్రస్ రాజీనామా చేయడంతో ఈ ఏడాదిలోనే రిషిసునాక్ బ్రిటన్ మూడవ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. బుధవారం పార్లమెంటులో మొదటి సెషన్‌ను ఎదుర్కోనున్నారు. బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ తొలి ప్రసంగం చేశారు. రానున్న రోజుల్లో కఠిన నిర్ణయాలకు బ్రిటన్ ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అప్పుల సమస్య పరిష్కారాన్ని రానున్న తరాలకు వదిలేయబోనన్నారు. లిజ్ ట్రస్ ద్వారా జరిగిన తప్పిదాలను సరిచేయడానికే తాను ప్రధాని అయినట్లు రిషి సునాక్ చెప్పారు. అంతకు ముందు బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ చివరి ప్రసంగం చేశారు. బ్రిటన్ కష్టకాలంలో ఉందని అయితే అతి త్వరలోనే మళ్లీ కోలుకుంటుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. తనకు బ్రిటన్ పౌరులపై నమ్మకముందని చెప్పారు. బ్రిటన్ ప్రధానిగా కొత్తగా ఎన్నికైన రిషి సునాక్‌కు ఆమె ఆల్ ది బెస్ట్ చెప్పారు. బ్రిటన్ రాణికి జాతి అంతిమ వీడ్కోలు పలికిన సమయంలో తాను బ్రిటన్ ప్రధానిగా ఉండటం తనకు గౌరవనీయమని విషయమని లిజ్ ట్రస్ చెప్పుకున్నారు. పుతిన్‌పై ఉక్రెయిన్ ధైర్యంగా పోరాడుతోందని, అందరూ ఉక్రెయిన్‌కు మద్దతునీయాలని సూచించారు. అంతేకాదు బ్రెగ్జిట్ వల్ల సొంతంగా ప్రయోగాలు చేసి ప్రయోజనాలు పొందాలని ఆమె సలహాఇచ్చారు. ప్రధానిగా చివరి ప్రసంగం చేశాక లిజ్ ట్రస్ బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు వెళ్లారు. బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ తప్పుకున్నాక లిజ్ ట్రస్ అధికార కన్సర్వేటివ్ పార్టీ నుంచి ప్రధానిగా ఎన్నికయ్యారు. కన్సర్వేటివ్ పార్టీ తరపున రిషి సునాక్, లిజ్ ట్రస్ మధ్యే పోటీ జరిగింది. చివరకు లిజ్ ట్రస్ విజేతగా నిలిచారు. కానీ ఆమె తీసుకు వచ్చిన మధ్యంతర బడ్జెట్ బ్రిటీష్ ఆర్ధిక వ్యవస్థను మరింత అస్తవ్యస్తం చేసింది. లిజ్ ట్రస్ ఆర్ధిక విధానాలతో బ్రిటన్ మరింత కష్టాల్లో చిక్కుకుంది. ఈ తరుణంలో అధికారం చేపట్టిన 45 రోజులకే ఆమె యూ టర్న్ తీసుకున్నారు. ప్రధానిగా తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత కన్సర్వేటివ్ పార్టీ రిషి సునాక్‌ను ప్రధానిగా ఎన్నుకుంది. వెయిటర్ నుంచి ప్రధాని స్థాయికి ఎదిగిన రిషి సునాక్ బ్రిటన్ చరిత్రలోనే ప్రధాని బాధ్యతలు స్వీకరించిన అత్యంత పిన్న వయస్కుడు.
బ్రిటన్ ప్రధాని కావడం అత్యంత అరుదైన సందర్భం
బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన తర్వాత ఆ దేశ ప్రజలను ఉద్దేశించి రిషి సునాక్ తన తొలి ప్రసంగం చేశారు. ఇది నా జీవితంలో గొప్ప అవకాశం.. బ్రిటీష్ ప్రజలకు అనునిత్యం సేవ చేస్తానని పేర్కొన్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా తన శక్తిమేర పని చేస్తానని స్పష్టం చేశారు. ఈ దేశానికి సేవ చేసేందుకు తన జీవితంలో లభించిన అతి పెద్ద గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
యూకే గొప్ప దేశమే అయినా ప్రస్తుతం మన దేశం తీవ్ర ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోందని తెలిపారు. ఈ నేపథ్యంలో మనకు స్థిరత్వం, ఐక్యత కావాలన్నారు. యూకేను ఏకతాటిపైకి తీసుకురావడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తానని సునాక్ స్పష్టం చేశారు. ప్రస్తుత సవాళ్లను అధిగమించి, భవిష్యత్ తరాలను గొప్పగా నిర్మిస్తానని చెప్పారు. కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా తనను ఎన్నుకున్న తమ పార్టీ ఎంపీలు, నేతలకు మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానని రిషి సునాక్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ సోమవారం చరిత్ర సృష్టించారు. యావత్ భారతావని దీపావళి పండుగ సంబురాలు జరుపుకుంటుండగా బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ స్థానానికి పోటీ పడిన పెన్నీ మోర్డాంట్ వైదొలగడంతో బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన తొలి భారత సంతతి నేతగా నిలిచారు. హిందూ భక్తుడైన రిషి సునాక్.. అధికార
357 మంది పార్టీ ఎంపీల్లో సగానికి పైగా ఎంపీల మద్దతు కూడగట్టుకున్నారు. ఎన్నికైన 45 రోజులకే ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్ రాజీనామా చేయడంతో తిరిగి బ్రిటన్ ప్రధాని ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేశారు. దీని ప్రకారం సోమవారం మధ్యాహ్నం రెండు గంటల్లోపు నామినేషన్ దాఖలు చేయాలని గడువు విధించారు. అయితే, కనీసం 100 మంది ఎంపీల మద్దతు ఉంటేనే బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ పడాల్సి ఉంటుంది. కేవలం 27 మంది ఎంపీల మద్దతు మాత్రమే లభించడంతో పెన్నీ మోర్డాంట్ పోటీ నుంచి వైదొలిగారు.
రిషి సునాక్‌కు అభినందనలు తెలిపిన ప్రధాని
రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని కావడం పట్ల భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండు వందల సంవత్సరాలకు పైగా భారత్ ను పాలించిన బ్రిటన్ కు ఓ భారతీయుడు ప్రధాని కావడం భారతీయులందరికీ గర్వకారణం. ఈ నేపథ్యంలోనే బ్రిటన్ పీఎంగా ఎన్నికైన రిషి సునాక్ కు ప్రముఖులు అభినందనలు చెబుతున్నారు. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన భారత సంతతికి చెందిన రిషి సునాక్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. గ్లోబల్ సమస్యల పై, 2030 రోడ్ మ్యాప్ పై విూతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు మోడీ తెలిపారు. భారత్, బ్రిటన్ ల మధ్య చారిత్రక సంబంధాలను ఆధునిక బంధాలుగా మారుద్దాం అని మోడీ తన ట్వీట్ లో తెలిపారు. ఈ సందర్భంగా బ్రిటన్ లోని భారతీయులకు మోడీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే సందర్భంగా ప్రదాని మోడీ మాజీ రాష్ట్రతపి రామ్‌నాథ్కోవిండ్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కడ్‌లను నేరుగా కలిసి దీపావళి శుబాకాంక్షలు తెలిపారు. వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
(గంటల వ్యవధిలోనే తన పనిని మొదలు రిషి సునాక్
` పలు కీలక నిర్ణయాలు.. ఉప ప్రధానిగా డొమినిక్ రాబ్ నియామకం.. పలువురికి ఉద్వాసన!)
లండన్(జనంసాక్షి):బ్రిటన్ నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల వ్యవధిలోనే రిషి సునాక్ తన పనిని మొదలుపెట్టారు. బ్రిటన్‌ను ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే దిశగా కసరత్తులో భాగంగా సాయంత్రానికే తన టీమ్‌ని ప్రకటించే పనిని షురూ చేశారు.బ్రిటన్ ఉప ప్రధానిగా డొమినిక్ రాబ్‌ని నియమించిన రిషి.. ప్రస్తుత ఆర్థికమంత్రిగా ఉన్న జెరివిూ హంట్‌ను అదే పదవిలో కొనసాగిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే, జేమ్స్ క్లెవర్లీని విదేశాంగ శాఖ కార్యదర్శిగా, బెన్ వాల్సేని డిఫెన్స్ సెక్రటరీగా నియమించారు. పార్లమెంటరీ సెక్రటరీ (చీఫ్ విప్)గా సైమన్ హార్ట్‌ని నియమించగా.. నదిమ్ జాహ్వికి మంత్రిగా అవకాశం కల్పించినప్పటికీ ఆయనకు ఏ శాఖను కేటాయించింది మాత్రం స్పష్టంచేయలేదు.మరోవైపు, లిజ్ ట్రస్ జట్టులో మంత్రులుగా ఉన్న పలువురిని తమ పదవులకు రాజీనామా చేయాలని రిషి కోరినట్టు సమాచారం. జాకబ్ రీస్` మాగ్, బ్రాండన్ లెవైస్, విక్కీ ఫోర్డ్‌ను తమ పదవుల నుంచి వైదొలగాలని సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. తన సొంత మంత్రివర్గాన్ని ప్రకటించడానికి వీలుగా వీరి నుంచి రాజీనామా కోరినట్టు తెలుస్తోంది. రిషి సునాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కాసేపటికే లిజ్ ట్రస్ ప్రభుత్వంలో ఉన్న పలువురు మంత్రులు తమ రాజీనామాలు సమర్పించడం గమనార్హం. ఈ జాబితాలో కిట్ మాల్తౌస్, రాబర్ట్ బక్‌ల్యాండ్, చ్లోల్ స్మిత్, రణిల్ జయవర్దనె వంటి వారు ఉన్నారు. మొదటి నుంచీ తనకు అండగా నిలిచిన వారికి రిషి తన మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది.