భారత్ జూడో యాత్రను విజయవంతం చేయండి ఏఐసీసీ నాయకులు
మఖ్తల్ అక్టోబర్ 11 (జనంసాక్షి) రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర సన్నాక సమావేశాన్ని నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నారాయణపేట జిల్లా డిసిసి అధ్యక్షులు వాకిటి శ్రీహరి అధ్యక్షతన నిర్వహించారు
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు& ఏఐసీసీ సెక్రెటరీ డాక్టర్ జి చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యే & ఏఐసీసీ సెక్రెటరీ డాక్టర్ సంపత్ కుమార్,
మాజీ ఎంపీ& రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు రవి పాల్గొన్నారు. అనంతరం ఎఐసిసి నాయకులు మాట్లాడుతూ ఈనెల 23 వ తేదీన ఉదయం 7:30 నిమిషాలకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించబోతుందని అన్నారు. ఈ యాత్ర మక్తల్ నియోజకవర్గంలోని క్రిష్ణా మండలం క్రిష్ణా నది బ్రిడ్జి వద్ద తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందన్నారు. ఈ యాత్రకు తెలంగాణా రాష్ట్రంలో నలుమూలల నుండి నాయకులు కార్యకర్తలు దాదాపు లక్ష మందితో రాహుల్ గాంధీకి స్వాగతం పలికేందుకు సన్నాహకలు చేస్తున్నట్లు తెలిపారు. భారత్ జూడో పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు
ఒబేదుల్లా కోత్వాల్, దేవరకద్ర నియోజకవర్గం నాయకులు
జి మధుసూదన్ రెడ్డి, మఖ్తల్ నియోజకవర్గ నాయకులు
ప్రశాంత్ రెడ్డి, మాజీ పిసిసి సమన్వయకర్త రాజుల ఆశిరెడ్డి, పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి, వివిధ మండలాల అధ్యక్షులు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, వైస్ ఎంపీపీలు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
2 Attachments • Scanned by Gmail