భారత్ బహుపరాక్!

9వరల్డ్ కప్ తొలి వారంలోనే కసి కూనలు సత్తా చాటాయి. కరీబియన్ టీమ్ వెస్టిండీస్ను తొలి మ్యాచ్లోనే ఐర్లాండ్ కాటేస్తే… మరోవైపు జింబాబ్వే, స్కాట్లాండ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాయి. పసికూనలు అన్న పదం మర్చిపోవాలని పెద్ద జట్లకు హెచ్చరికలు పంపాయి.

ప్రపంచకప్ లో పసి కూనలు అన్న పదం మర్చిపోవాలని తొలి వారం మ్యాచ్ లతోనే కన్ఫర్మ్ అయిపోయింది. క్రికెట్ మెగా వార్ లో ఇక చిన్న జట్లన్నీ కసి కూనలే. వరల్డ్ కప్ ప్రారంభమైన తొలి వారంలోనే ఐర్లాండ్, జింబాబ్వే, స్కాట్లాండ్ సూపర్ పర్ఫార్మెన్స్ కనబర్చాయి. ఈ మూడింట్లో గెలిచింది ఒక్క జట్టే అయినా ఆట పరంగా పెద్ద జట్లుకు ఏ మాత్రం తీసిపోమని మూడు టీమ్స్ నిరూపించాయి. ఐర్లాండ్ ఏకంగా వెస్టిండీస్ కు షాకిస్తే… జింబాబ్వే, స్కాట్లాండ్ ప్రత్యర్థులకు వెన్నులో వణుకు పుట్టించాయి. క్వార్టర్ ఫైనల్ జర్నీ కూడా అంత ఈజీ కాదని ఫేవరెట్ టీమ్స్ కు బోధపడింది.

2007 వరల్డ్ కప్ నుంచి సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా పేరుగాంచిన ఐర్లాండ్ టీమ్ ఈ ప్రపంచకప్ లో తొలిమ్యాచ్ లోనే సత్తా చాటింది. 2007 వరల్డ్ కప్ లో పాకిస్తాన్, 2011 వరల్ డ్కప్ లో ఇంగ్లండ్.. ఈ సారి విండీస్ వంతు. పూల్-బిలో ఐర్లాండ్ ఆడిన తొలి మ్యాచ్ లోనే సూపర్ విక్టరీ కొట్టింది.

ఇక పూల్-బిలోనే మరో కసి కూన జింబాబ్వే తొలి మ్యాచ్ లో అద్బుత పోరాటంతో అలరించింది. వార్మప్ గేమ్లో శ్రీలంకను ఓడించిన జింబాబ్వే తొలి పోరులో ఏకంగా సౌతాఫ్రికాకే చుక్కలు చూపించింది.

మరోవైపు పూల్-ఏలో స్కాట్లాండ్ కూడా తొలి పోరులోనే ఆకట్టుకుంది. ఆతిథ్య దేశం న్యూజీలాండ్ తో జరిగిన మ్యాచ్ లో స్కాట్లాండ్ బౌలింగ్ లో భళా అనిపించింది. ఈజీ టార్గెట్ కదా అని లైట్ తీస్కున్న న్యూజీలాండ్ కు తృటిలో ఓటమినుంచి గట్టెక్కింది.

విండీస్ పై గెలిచిన ఐర్లాండ్ మరో పెద్ద దేశానికి షాకివ్వాలని పట్టుదలగా ఉంది. ఎలాగైన క్వార్టర్ ఫైనల్ బెర్తు దక్కించుకోవాలని ఐరిష్ క్రికెటర్లు కసిగా పోరాడనున్నారు. అందుకని టీమ్ఇండియా బీ కేర్ ఫుల్ అంటున్నారు ఎక్స్ పర్ట్స్. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న అప్రోచ్ తో ఆడాలంటున్నారు. ఏమరపాటుగా ఉంటే మొదటికే మోసం తప్పదంటున్నారు.