భారత్ బ్యాటింగ్ వర్సెస్ దక్షిణాఫ్రికా బౌలింగ్
మెల్‌బోర్న్: ప్రపంచ కప్ లీగ్ దశలో కీలక మ్యాచ్ ఆదివారం జరగనుంది. డిఫెండింగ్ చాంపియన్ భారత్‌తో దక్షిణాఫ్రికా తలపడుతుంది. రెండు జట్లు సమఉజ్జీలుగా ఉన్నందున ఆ రోజు ఎవరు బాగా ఆడితే వారు గెలుస్తారని భారత్ స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి అన్నాడు. అగ్రశ్రేణి బ్యాట్‌మన్ ఉన్న భారత్, బౌలింగ్‌లో పటిష్టంగా ఉన్న దక్షిణాఫ్రికా మధ్య రసవత్తర పోరు జరగనుందని ఈ చిచ్చర పిడుగు మీడియాతో చెప్పాడు. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోడానికి మార్గం సుగమం అవుతుందనడంలో సందేహం లేదని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.