భారత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీజీ జయంతి నివాళులర్పించిన కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి
కొండమల్లేపల్లి నవంబర్ 19 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ జనరంజక పాలన అందించి ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న నాయకురాలు ఇందిరా గాంధీ. గతంలో పాలన అంటే.. ఇందిరమ్మ రాజ్యంలా ఉండాలనే అంతగా గుర్తింపు వచ్చింది. తీరు లేని నేతగా ఎదిగింది. దేశ రాజకీయాలను ఒంటి చేతితో శాసించింది. బలమైన నాయకురాలుగా ప్రత్యర్థి పార్టీలకు వణుకు పుట్టించారు. తన పాలనలో ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంది. తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన ఇందిరా గాంధీ శతజయంతి వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారని భారతదేశపు మొట్టమొదటి , ఏకైక మహిళా ప్రధానమంత్రి . ఇందిరా గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో జన్మించారు. ఈమె స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కుమార్తె. ఆమె తల్లి కమలా నెహ్రూ కూడా స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత జాతీయ కాంగ్రెస్ నాయకురాలు. ఇందిరా గాంధీ 1966లో భారతదేశానికి మూడవ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఆమె నాయకత్వంలో తూర్పు పాకిస్తాన్‌లో స్వాతంత్ర్య ఉద్యమానికి మద్దతుగా భారతదేశం పాకిస్తాన్‌తో యుద్ధానికి దిగింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ ఏర్పడింది. ఇందిరా గాంధీ తన హయాంలో సంచలన నిర్ణయం తీసుకుంది. 1975 నుండి 1977 వరకు ఎమర్జెన్సీ విధించింది భారత దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ 105వ జయంతి సందర్భంగా దేశమంతా ఆమెను స్మరించుకుంటోంది. 1917 నవంబర్ 19న అలహాబాద్‌లో కశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించారు ఇందిరా గాంధీ. 1984 అక్టోబర్ 31వ తేదీన తుది శ్వాస విడిచారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో అత్యంత కీలకమైన నేతల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. 1966లో భారత దేశానికి మూడో ప్రధానిగా ఎన్నికయ్యారు. దేశ చరిత్రలో ఓ మహిళ ప్రధాని కావడం అదే తొలిసారి. అయితే..ప్రధానిగా ఎన్నికైన కొన్నాళ్ల వరకు ఆమెకు ఎన్నో విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్‌లోని సీనియర్ నేతల చేతుల్లో “కీలుబొమ్మ”గా మారిపోయారన్న అసహనమూ పెరిగింది. కానీ…క్రమంగా తనను తాను మార్చుకున్నారు ఇందిరా గాంధీ. ప్రధానిగా ఓ టర్మ్ పూర్తి చేసుకున్నాక ఆమెలో చాలా మార్పు వచ్చింది. సీనియర్ నేతల చేతుల్లో కీలుబొమ్మ అన్న వాళ్లే “ఇండియా అంటే ఇందిరా” అని కీర్తించే స్థాయికి ఎదిగారు. పాకిస్థాన్‌తో యుద్ధానికి దిగడం, బంగ్లాదేశ్ ఉద్యమ సమయంలో ఆ దేశానికి మద్దతుగా నిలవడం
లాంటివి ఆమెకు పేరు తెచ్చి పెట్టాయి. 1970 ల నాటికి భారతదేశ రాజకీయాల్లో అత్యంత శక్తిమంతమైన నేతగా పేరు తెచ్చుకున్నారు ఇందిరా. భారత దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కూతురిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టినా…తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. నెహ్రూ తరవాత భారత్‌కు అత్యంత ఎక్కువ కాలం ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించింది ఇందిరా గాంధీయే. 1966 నుంచి 1977 వరకూ..మళ్లీ 1980 జనవరి నుంచి 1984 అక్టోబర్‌లో ఆమె తుది శ్వాస విడిచే వరకూ ప్రధానిగా కొనసాగారు. భారత ప్రజల గుండెల్లో ఇందిరా గాంధీ చివరి స్థాయిగా నిలిచిపోతారని తెలిపారు భారత ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి నివాళులర్పిస్తూ తమ సంతాపం తెలియజేశారు