భారత రాజ్యాంగం శక్తివంతమైనది

శ్రీకాకుళం, జూలై 26 : భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతంతమైనదని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.సువర్ణరాజు పేర్కొన్నారు. ఈ మేరకు శ్రీకాకుళం పట్టణంలోని స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ దేశ పౌరులుగా విద్యార్థి దశ నుంచే రాజ్యాంగంలో పొందుపర్చిన హక్కులు, వాటి పరిరక్షణకు, సద్వినియోగానికి రూపొందించిన చట్టాల మీద అవగాహన ఉండాలన్నారు. న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక, రాజకీయ వ్యవస్థలపై పూర్తిస్థాయి పట్టు కలిగి ఉండటం అందరి సామాజిక బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా 8,9 తరగతుల విద్యార్థులతో న్యాయసలహా క్లబ్‌లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ న్యాయవాదులు ఉషాదేవి, ఇందిరాప్రసాదరావు, పాపినాయుడు, సంఘసేవకులు రమణశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు