భారత స్వతంత్ర వజ్రోత్సవ సందర్భంగా..ఇంటింటికి జాతీయ పతాకాల పంపిణీ..

–జెండాను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్,ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్

 

గద్వాల రూరల్ ఆగష్టు 09 (జనంసాక్షి):- గద్వాల జిల్లా కేంద్రంలో భారత స్వతంత్ర వజ్రోత్సవాలు పురస్కరించుకొని ఆగష్టు తేదీ 8 నుండి తేదీ 22 వరకు రాష్ట్ర సీఎం కేసీఆర్ గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే భారత స్వతంత్ర వజ్రోత్సవాలు పురస్కరించుకొని 31వ వార్డ్ లో ఇంటింటికి జాతీయ జెండాను పంపిణీకి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి..జిల్లా కలెక్టర్ శ్రీహర్ష ముఖ్య అథితులుగా హాజరై జాతీయ జెండాలను అందజేశారు..ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్,మున్సిపల్ చైర్మన్ వార్డ్ కౌన్సిలర్ నరహరి శ్రీనివాసులు , వార్డ్ సభ్యులు పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు..ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, చైర్మన్ గట్టు ఈశ్వరయ్య భగవద్గీత పుస్తకాన్ని బహుకరించారు..ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ….భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వ్యాప్తంగా ఆగష్టు 8నుండి 22 వరకు స్వతంత్ర వజ్రోత్సవాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. లక్షలాదిమంది ప్రజల పోరాటం వేలాదిమంది ప్రాణ త్యాగాలతో బ్రిటీష్ వారి నుంచి దేశానికి స్వాతంత్రం వచ్చిందని తెలిపారు. వారి పోరాటం ప్రాణ త్యాగాలను గుర్తు చేసుకునే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో స్వాతంత్ర వజ్రోత్సవాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు అందులో భాగంగా మొదటి రోజు ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు తెలియజేశారు. ప్రజలు జాతీయ జెండాను తమ ఇళ్లపై ఎగరవేసి దేశభక్తిని చాటుకోవాలని కోరారు. .వేడుకల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు భాగస్వాములై వజ్రోత్సవం వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు..అనంతరం సినిమా థియేటర్లో మహాత్మ గాంధీజీ చిత్రాన్ని తిలకిస్తున్న పాఠశాల విద్యార్థులకు ఎమ్మెల్యే చైర్మన్ బిస్కెట్ల పంపిణీ చేశారు..ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బియస్ కేశవ్ , జడ్పీ వైస్ చైర్మన్ సరోజమ్మ, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామేశ్వరమ్మ, జెడ్పీటీసీ రాజశేఖర్, మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్ కౌన్సిలర్స్, మురళి నాగిరెడ్డి, కృష్ణ, మహేష్, గద్వాల టౌన్ పార్టీ అధ్యక్షుడు గోవిందు, గద్వాల మండలం రాముడు, ప్రధాన కార్యదర్శి సాయి శ్యామ్ రెడ్డి, తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు యూత్ సభ్యులు, వార్డ్ ప్రజలకు తదితరులు పాల్గొన్నారు.