భారత స్వతంత్ర వజ్రోత్సవ ద్విసప్తహం వేడుకల ద్వారా
దేశ భక్తి, జాతీయ స్ఫూర్తిని పెంపొందించాలి
:రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి
# నల్గొండ పట్టణం లో ఇంటింటికీ జాతీయ పతాకం పంపిణీ ప్రారంభించిన మంత్రి,ప్రతి ఇంటి పై జాతీయ పతాకం రెప రెప లాడాలి
నల్గొండ బ్యూరో. జనం సాక్షి , ఆగస్టు 9.
దేశ భక్తి,జాతీయ
జాతీయ సమైక్యత,జాతీయ స్ఫూర్తిని, స్వాతంత్య్రం పోరాటం లో మహనీయులు త్యాగాలను మూడవ తరం కు తెలుపాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు.నల్గొండ మున్సిపాలిటీ లో ప్రజా ప్రతినిధులు,అధికారుల తో ఏర్పాటు చేసిన సమావేశం లో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్ట్ 8 నుండి 22 వరకు భారత స్వతంత్ర వజ్రోత్సవ ద్విసప్తహ వేడుకలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.స్వాతంత్ర్య పోరాటం లో గాంధీ నాయకత్వం లో అహింసా పద్దతి లో పోరాటం చేసి దేశానికి స్వాతంత్య్రం సాధించుకున్న ట్లు ఆయన తెలిపారు.స్వాతంత్ర్య పోరాటం లో ఎందరో నాయకులు తమ ప్రాణాలను త్యాగం చేశారని,దేశ స్వాతంత్ర్య పోరాటం స్ఫూర్తి,దేశ భక్తిని చాటేలా వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అన్ని పట్టణాలలో జాతీయ పతాకం ప్రతి ఇంటికి వార్డ్ సభ్యుల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఆగస్ట్15 న ఇంటింటా జాతీయ పతాకం ఎగురవేసి తమ దేశ భక్తిని చాటాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ కార్యాలయం లో కౌన్సిలర్ లకు జాతీయ పతాకం లు పంపిణీ చేశారు. జాతీయ పతాకం లను ఇంటింటికీ పంపిణీ చేసిన మంత్రి. నల్గొండ మున్సిపాలిటీ లో జరిగిన
స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకల సమావేశం లో మంత్రి పాల్గొని అనంతరం పట్టణం లో 47 వ వార్డు లో జాతీయ పతాకాలను ఇంటింటికీ పంపిణీ చేసే కార్యక్రమాన్ని లాంఛనంగా మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతీయ సమైక్యత భావాన్ని ప్రతి ఒక్కరి మదిలో నాటింప జేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా రూపకల్పన చేసిన స్వతంత్ర భారత వజ్రోత్సవాలను జిల్లా స్థాయి నుండి గ్రామస్థాయి వరకు విభిన్న కార్యక్రమాలు రూపొందించినందున ప్రతి ఒక్కరూ కంకణ బద్ధులై ఉండాలన్నారు.
జాతీయ పతాకాన్ని ఇంటింటా ఎగురవేస్తూ జాతీయ సమైక్యతను చాటాలన్నారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
ఎమిరాల్డ్ పార్క్,5 రూ.లకు భోజనం అందించే అన్నపూర్ణ క్యాంటీన్ ను ప్రారంభించిన మంత్రి. కలెక్టర్ క్యాంపు కార్యాలయం పక్కన మున్సిపాలిటీ ద్వారా ఏర్పాటు చేసిన ఎ మిరాల్డ్ పార్క్ ను మంత్రి ప్రారంభించారు .అక్కడే మున్సిపాలిటీ ద్వారా పేదలకు 5 రూ.లకే భోజనం అందించే అన్నపూర్ణ క్యాంటీన్ ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి తో పాటు రాజ్య సభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,ఎన్.భాస్కర్ రావు,మున్సిపల్ చైర్మన్ యం. సైది రెడ్డి,వైస్ చైర్మన్ అబ్బగొని రమేష్,జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ,ఎస్.పి. రె మా రాజేశ్వరి, డి.అర్.ఓ జగదీశ్వర్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ కె.వి. రమణా చారి,కౌన్సిలర్ లు ,అధికారులు పాల్గొన్నారు