భారీగా టేకు మొక్కల పెంపకం

అడవుల విస్తీర్ణం పెంపు కోసం కసరత్తు
అధికారులకు దిశానిర్దేశం చేసిన ఎర్రబెల్లి

వరంగల్‌,జూలై16(జనం సాక్షి ): వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టేలా జిల్లాల యంత్రాంగం సిద్దం అయ్యింది. ఈసారి భారీగా వర్షాలు కరియడంతో వాతావరనం అనుకూలంగగా ఉందని భావిస్తున్నారు. అయిదు జిల్లాల వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకు అనుగుణంగా నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నారు. మంత్రి ఎర్రబెల్లి కూడా హరితహారం కోసం అధికారులకు దిశానిర్దేశం చేశారు. వీటిల్లో దాదాపు 60 శాతం టేకు మొక్కలే ఉన్నాయి. గ్రావిూణాభివృద్ధి, అటవీ, వ్యవసాయ, ఉద్యాన, పోలీసు, విద్యా, తదితర శాఖలు భాగస్వామ్యం కానున్నాయి. వరంగల్‌ నగరంలో మొక్కలు నాటే బాధ్యతను వరంగల్‌ మహానగర పాలక సంస్థ తీసుకొంది. హరితహారం విజయవంతం కావాలంటే గ్రామ స్థాయి ప్రజల భాగస్వామ్యం ఉండాలని సర్కారు భావించింది. అందుకే గ్రామాల్లో గ్రామ హరిత రక్షణ కమిటీలను ఏర్పాటు చేస్తోంది. మొక్కలు నాటాక సంరక్షణ బాధ్యతను వారికి అప్పగించేందుకు ప్రణాళిలకు సిద్దం చేశారు. సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణకు హరితహారం కింద జనగామ జిల్లాలో ఆటవీ సంపదను 33 శాతాని పెంచాలన్న లక్ష్యాన్ని నిర్దేశించింది. హరితహారంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం జనగామ జిల్లాలో పెద్దఎత్తున మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇప్పటికే కలెక్టర్‌ చొరవతో సీడ్‌ బాంబింగ్‌ పెద్ద ఎత్తున చేపట్టి విజయవంతం చేశారు.అడవులను 33 శాతానికి పెంచేందుకు మహోద్యమంలా మొక్కల పెంపకానికి జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. దీంతో కరువు జిల్లా జనగామలో ప్రయోగించిన సీడ్‌బాల్స్‌ మొలకెత్తి హరితహారం ఆశలు చిగురిస్తున్నాయి. ప్రభుత్వ భూములు, కంటూరు కందకాలు, ఖాళీ ప్రదేశాల్లో వేసిన విత్తన బంతులు ఇటీవల వర్షాలకు మొలకెత్తి జిల్లా యంత్రాంగం ఆశలకు ఊపిరిలూదాయి. జిల్లాలో అటవీ సాంద్రత తక్కువగా ఉండంతో అటవీ సాంద్రతను పెంచాలని దృఢసంకల్పంతో ముందుకు సాగుతున్నామని అన్నారు.