భారీ ఓటమి దిశగా విండీస్

సిడ్నీ: దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో వెస్టిండీస్ భారీ ఓటమి దిశగా పయనిస్తోంది. ప్రపంచ కప్ పూల్-బిలో భాగంగా శుక్రవారం జరుగుతున్న మ్యాచ్లో.. 409 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కరీబియన్లు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేశారు.

జింబాబ్వేతో మ్యాచ్లో చెలరేగిన వెస్టిండీస్ బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ (3), శామ్యూల్స్ (0).. దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో నిరాశపరిచారు. దీంతో విండీస్ ఓ దశలో 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తర్వాత బ్యాటింగ్కు వచ్చిన కార్టర్ (10), ఓపెనర్ స్మిత్ (31), సిమ్మన్స్ (0), సామీ (5), రస్సెల్ (0) ఇలా వచ్చి అలా వెళ్లారు. ప్రస్తుతం రామ్దిన్ (6), కెప్టెన్ హోల్డర్ (0) క్రీజులో ఉన్నారు.