భారీ ప్రజా ఆదరణలో పోచారం భాస్కర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
రుద్రూర్(జనంసాక్షి):
రుద్రూర్ మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ యువజన సంఘం ఆద్వర్యంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలలో భాగంగా రుద్రూర్ కేజీబివి కస్తూరిబా విద్యార్థులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం , తెరాస మండల నాయకులు , మండల కార్యకర్తలు, మైనార్టీ సోదరులు రుద్రూర్ మండల కేంద్రంలోని షాదిఖానలో తమ ప్రియతమ నాయకుని పుట్టిన రోజు వేడుకలను అభిమానం పొంగేలా వివిధ కార్యకర్తలు వివిధ రీతులలో పోచారం భాస్కర్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మొదటగా మైనార్టీ సోదరులు పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానించి ఆహ్వానించారు, అనంతరం రుద్రూర్ మండల నాయకులు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భారీ కేకును కార్యకర్త ఇచ్చిన భారీ తల్వార్ తో కేకును కట్ చేశారు, అనంతరం మాజీ విండో చైర్మన్ పత్తి రాము, మండలాధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, మరియు ఎంపీటీసీ సత్తి సావిత్రి, వారి తనయుడు పత్తి నవీన్ వారి స్నేహితులు కలిసి, తమ ప్రియతమ నాయకుడు పోచారం భాస్కర్ రెడ్డి బాన్సువాడ నియోజకవర్గంలో చేసిన వివిధ సంక్షేమ కార్యక్రమాల చిత్రపటాలను సమీకరించి ఒక దగ్గరగా కూర్చీ ఆ వినూత్న చిత్రపటాన్ని ఆయనకు బహుకరించారు. అనంతరం మండలంలోని వివిధ నాయకులు కార్యకర్తలు పూలమాలతో పుష్పగుచ్ఛం లతో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ యొక్క కార్యక్రమంలో జడ్పిటిసి నారోజీ గంగారాం, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అక్కపల్లి నాగేందర్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పత్తి లక్ష్మణ్, మాజీ సొసైటీ చైర్మన్ పత్తి రాము, టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బాల్ రాజ్, గ్రామ అధ్యక్షులు తోట్ల చిన్న గంగారాం, సొసైటీ చైర్మన్ బద్దం సంజీవరెడ్డి, మాజీ ఎఎంసి చైర్మన్ బందెల సంజీవులు, రైతు సమన్వయ సమితి అద్యక్షులు తోట సంగయ్య, ఎఎంసి డైరెక్టర్ రామ గౌడ్, కన్నె రవి, జావేద్ ,ఖురేషి, అజ్జు ఖురేషి, సతీష్ ( అంబం) క్లిక్ రవి, మండల కార్యదర్శి శ్రీకాంత్ ,అంజయ్య, కో ఆప్షన్ మెంబర్ మస్తాన్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.