భారీ మెజారిటీతో కెటిరామారావును గెలిపించుకుంటాం……

Translate message
Turn off for: Telugu
 
–బండ తండా, శాంతినగర్ గిరిజనలు మహిళలు
వీర్నపల్లి అక్టోబర్ 27 (జనంసాక్షీ):-
వీర్నపల్లి మండలంలో రోజు రోజుకి టిఆర్ఎస్ పార్టీ కెటి రామారావుకు ప్రజల మద్దతు పెరుగుతుంది. ఏకగ్రీవ తీర్మాణాలు పార్టీలో చేరికలతో వచ్చే ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఎంపిటిసి కమల విఠలనాయక్ ఆద్వర్యంలో వాగ్దానాలు చేస్తున్నారు. నూతనంగా ఏర్పడిన శాంతినగర్ గ్రామపంచాయతీ పరిధిలోని బండ తండ,శాంతినగర్ తండా వాసులు తమ ఓటు టిఆర్ఎస్ పార్టీకే నంటూ ఏకగ్రీవ తీర్మానం చేస్తు ప్రమాణం చేశారు. ఇట్టి కార్యక్రమానికి ఉమ్మడి మండల జెడ్పిటిసి తోట ఆగయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తండా వాసులు జిల్లా చివర్లో ఉన్న శాంతినగర్ ను ఏ నాయకుడు పట్టించుకున్న పాపాన పోలేదని,కానీ టిఆర్ఎస్ పార్టీ వీరిని గుర్తించి గ్రామపంచాయతీని ప్రకటించి కోట్ల రూపాయలతో హైలెవల్ బ్రిడ్జి,సిసి రోడ్ల నిర్మాణం ఇలా మూల ఉన్న గ్రామానికి చేసిన ఘనత టిఆర్ఎస్ పార్టీదైన కెటి రామారావుది అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆరెస్ మండల అద్యక్షుడు శ్రీరాంనాయక్ మాజీ ఎఎంసి చేర్మన్ అందెసుబాష్ మాజీ ఎంపిపి ఎలసాని మోహన్ కుమార్ ఆర్ఎస్ఎస్ మండల అద్యక్షులు ఎడ్ల సాగర ఎఎంసి వైస్ చేర్మేన్ నీలం రాజేష్ ఎఎంసి డైరెక్టర్ మల్లేశం,టీఆరెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు చంద్రం నాయకులు మల్లేశం జగన్  రఫీక్ శెకర్ ఎస్ మల్లేశం భూక్య రాజు అన్నంరెడ్డీ,మదన్ రాంరెడ్డి,దేవేందర్, రాములు, మల్లేశం,రవి రైతులు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు.