భారీ వర్షాలకు రోడ్డు ధ్వంసం. నిలిచిపోయిన రాకపోకలు
. స్పందించని అధికారులు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు………
జనం సాక్షి జూలై 29 రాయికల్
మండల్……. రామాజీపేట వీరాపూర్ గ్రామాలకు అనుసంధానమైన బైపాస్ రోడ్డు 12 గ్రామల ప్రజలకు చాలా ఉపయోగంగా ఉంటుంది జగిత్యాల దూర భారం తగ్గిస్తుంది అనునిత్యం ప్రజల రాకపోకలతో రహదారి రద్దీగా ఉండేది కానీ మొన్న కురిసిన వర్షాలకు రోడ్డు కోతకు గురైంది అనునిత్యం రాకపోకలకు వెళ్లే ప్రజలకు తీవ్ర అసౌకర్యం ఏర్పడుతుంది ఇప్పటికైనా కోతకు గురైన రోడ్డును మరమ్మతు చేయాలని ప్రజలు వాహనదారులు కోరుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు నిర్మించాలని లేదంటే అధికారుల నిర్లక్ష్యానికి ప్రమాదాలు మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థితి దాపురుస్తుంది మరి అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి