భార్యను చితకబాదిన భర్త: చికిత్సపొందుతూ భార్య మృతి
మద్దూరు, వరంగల్: వరంగల్ జిల్లా మద్దూరు మండలంలోని కొండాపూర్ శివారు సర్పంచి తండాలో కుటుంబకలహాల కారణంగా మద్యం మత్తులో ఉన్న భర్త శనివారం రాత్రి భార్యను చితకబాదాడు. గాయాలపాలైన రేణుక (29)ను బంధువులు ఆస్పత్రికి తరలించగా ఆమె చికిత్సపొందుతూ ఈరోజు మృతిచెందింది. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. నిందితుడు దారావత్ రాజును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎన్‌ఐ రామకృష్ణ తెలిపారు.