భార్యలకు, ప్రియురాళ్లకు అనుమతి లేదు!
న్యూఢిల్లీ: దాదాపు 45 రోజుల పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరిగే ప్రపంచకప్ సందర్భంగా భారత క్రికెట్ ఆటగాళ్లు తమ భార్యలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఎదురుకానుంది. ప్రపంచకప్ నిబంధనల మేరకు ఈ మెగా ఈవెంట్‌కు ఆటగాళ్ల భార్యలు, ప్రియురాళ్లను అనుమతించడం కుదరదు. మరోవైపు ఈ విషయాన్ని బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
సరిగ్గా ప్రేమికుల దినోత్సవం రోజే (ఫిబ్రవరి 14) వరల్డ్‌కప్ ప్రారంభం కానుండగా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి తన ప్రియురాలు అనుష్క శర్మకు దూరంగానే గడపాల్సి వస్తోంది. సుదీర్ఘ పర్యటనలో తమ క్రికెటర్ల వెంట భార్యలు వెళ్లేందుకు బీసీసీఐ అనుమతిస్తున్నప్పటికీ ప్రపంచ కప్‌లో ఇంతకు ముందు ఎలా జరిగిందో దానికే కట్టుబడి ఉంటామని బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.