భార్య పై పెట్రోల్ పోసి చంపిన భర్త
హుజూర్ నగర్, సెప్టెంబర్ 17 (జనం సాక్షి): హుజూర్ నగర్ మండల పరిధిలోని మర్రిగుడెం గ్రామానికి చెందిన గొట్టిముక్కల గోపయ్య 35 సం.రాల క్రితం గరిడేపల్లి మండలం కట్టవారిగుడెం గ్రామానికి చెందిన వెంకటమ్మ తో వివాహం జరిగిందని, వారికి ఇద్దరు కుమారులు కలిగి ఉన్నారని ఎస్సై తెలిపిన వివరాలు ప్రకారం గోపయ్య గత కొన్ని సం.రాలు నుండి మద్రాస్ లో బిక్షాటన చేస్తూ, వచ్చిన డబ్బులతో మద్యం తాగుతు నిత్యం భార్యను వేధిస్తూ చిత్రహింసలకు గురిచేస్తుండేవాడు తేదీ 16.09.22 శుక్రవారం తన భార్య మద్యానికి డబ్బులు ఇవ్వలేదని, కక్ష పెంచుకుని రాత్రి 11 గంటల సమయంలో మృతురాలు తన గదిలో నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పు అంటించగా మృతురాలు అక్కడికక్కడే చనిపోయిందని మృతురాలి కుమారుడు జానకి రామయ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపారు.