భావి తరాల భవిష్యత్ కోసం మొక్కలు నాటాలి

– డిసీసీబీ చైర్మన్ బుయ్యాని మనోహర్ రెడ్డి
కుల్కచర్ల,జులై 30(జనం సాక్షి):
భావిత తరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.శనివారం కుల్కచర్ల మండల పరిధిలోని తీర్మాలపూర్ గ్రామ పంచాయతీలో హరితహారం కార్యక్రమంలో భాగంగా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి మొక్కలు నాటి నీళ్ళు పోశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విధిగా మొక్కలు నాటి అంతరించిపోతున్న అడవులను సంరక్షించాలని,ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎనిమిదో విడత హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.గ్రామాలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతూ ప్రణాళికాభివృద్ధే ధ్యేయంగా మరో దఫా హరితహారం కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.అనంతరం
గ్రామంలో పాఠశాలను తనిఖీ చేశారు.పిల్లలకు మంచి విద్యను అందించాలన్నారు.పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు.వార్డులలో చేపట్టిన అభివృద్ధి పనులను వార్డు ప్రజలకు వివరించి, పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జెడ్పీటీసీ రాందాస్ నాయక్, గ్రామ సర్పంచ్ వెంకటమ్మ చిన్నయ్య యాదవ్, ఎంపీటీసీ రాంలాల్, గ్రామ సెక్రటరీ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ శివయ్య, గ్రామ కమిటీ అధ్యక్షుడు రాములు, కె.మొగులయ్య, గుండుమల్ల నర్సింలు,కె.వెంకటయ్య,  జి.అంజీలయ్య, కె సత్యయ్య, గొల్ల శ్రీను, కె.వినోద్, దామోదర్ రెడ్డి, బచ్చిరెడ్డి, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, గ్రామ ప్రజలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.