భావి శాస్త్రవేత్తలు అబ్దుల్ కలాం ను స్ఫూర్తిగా తీసుకోవాలి

– డీఈఓ డాక్టర్ గోవిందరాజులు
నాగర్ కర్నూలు జిల్లా బ్యూరో అక్టోబర్ 15 జనం సాక్షి:
డా.ఏపీజే అబ్దుల్ కలాం 91వ జయంతి సందర్భంగా శనివారం  నాగర్ కర్నూలు డిఈఓ కార్యాలయంలో సిబ్బందితో కలిసి కలాం చిత్రపటానికి పూలమాలతో డిఈఓ గోవిందరాజులు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. శాస్త్రవేత్తగా మరియు రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం సేవలను వారు గుర్తు చేసుకున్నారు.  మన దేశానికి శాస్త్రవేత్తగా మరియు సమాజంలోని ప్రతి వర్గాన్ని ప్రభావితం చేసిన రాష్ట్రపతిగా ఆయన చేసిన కృషికి ఆయన ఎంతో ప్రశంసించబడ్డారు” అని తెలిపారు.
నేటి విద్యార్థులు భావిశాస్త్రవేత్తలుగా ఎదగాలనుకునేవారు అబ్దుల్ కలాం స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు.
జిల్లాలో సైన్స్ ఉపాధ్యాయులు ఆ విధంగా కృషి చేయాలని ఆయన కోరారు.
అబ్దుల్ కలాం ఆశయాలను విద్యార్థులు కలలుకని సాకారం చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో గణాంకధికారి ఈశ్వరప్ప, జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి, సెక్టోరల్ అధికారిని సూర్య చైతన్య, కార్యాలయ పర్యవేక్షకులు నాగేందర్, శైలజ, సిబ్బంది వెంకట్, కృష్ణ , నరసింహ, వెంకట్ కుమార్, కేజీబీవీల ప్రత్యేక అధికారులు లత, సైదాబాను తదితరులు పాల్గొన్నారు.
Attachments area