భూముల అమ్మకాలకు కొత్త మార్గ దర్శకాలు
హైదరాబాద్: మాజీ సైనికోద్యోగులకు ప్రభుత్వం కేటాయించిన భూముల అమ్మకాలకు సంబంధించి తాజా మార్గదర్శకాలు రూపొందించారు. వీరి భూములను ఇతరులకు అమ్మాలనుకుంటే అందుకు అవసరమైన ఎన్‌ఓసీ జారీ చేసే అధికారాలను నిర్ణయించారు. ఈరోజు రాత్రి సచివాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకాన్నారు. 50 లక్షల నుంచి 2 కోట్ల రూపాయల లోపు విలువైన భూమికి అమ్మాలనుకుంటే ప్రభత్వం నుంచే ఇకపై అనుమతులు పోందాలి, ఈ ఏడాది జనవరి నుంచి మార్చి 18 వరకూ జరిగిన రెవెన్యూ సదస్సుల్లోనూ భాగంగా వచ్చిన దరఖాస్తుల పైనా మంత్రి సమీక్షించారు. వచ్చిన 6 లక్షల దరఖాస్తులకు గాను దాదాపు 3 లక్షల దరఖాస్తులు పరిష్కరించినట్లు రెవెన్యూ శాఖ వెల్లడించింది.