భూసేకరణ బిల్లుపై పారదర్వక చర్చ : గడ్కరీ

న్యూఢిల్లీ,ఫిబ్రవరి25 (జ‌నంసాక్షి) : భూసేకరణ బిల్లుపై పారదర్శక చర్చకు తామ సిద్ధమని కేంద్ర రవాణాశాఖ మంత్రి గడ్కరీ తెలిపారు. భూసేకరణ బిల్లుపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళలనలపై ఆయన స్పందిస్తూ.. భూసేకరణ బిల్లుతో రైతులకు ప్రయోజనాలే తప్ప నష్టాలు లేవన్నారు. భూసేకరణ సందర్భంగా  పరిహారం, పునరావాసం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ఇవన్నీ కూడా బిల్లులో ఉన్నాయని అన్నారు.  గ్రావిూణాభివృద్ధికి భూసేకరణ బిల్లు ఎంతో ఉపయోగపడుతుందన్న మంత్రి దీనిని అర్థం చేసుకోకుండా విమర్శలుచేయడం తగదన్నారు.  ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంపై అపోహలు వద్దన్నారు.  పీపీపీ పద్ధతిలో చేపట్టిన ప్రతి నిర్మాణం ప్రభుత్వానికే చెందుతుంది. భూ సేకరణ బిల్లులోని వాస్తవాలు వేరు, జరుగుతున్న ప్రచారం వేరు. మాది రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ప్రతిపక్షాలు చిత్రీకరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి దుష్పచ్రారం వల్ల నష్టపోయేది ప్రజలన్నారు.