భోగి మంటలు అంటుకుని ముగ్గురికి తీవ్రగాయాలు
బిక్కవోలు : తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం వందలపాకలో సంక్రాంతి వేడుకలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ ఉదయం భోగి మంటలు వేస్తుండగా ప్రమాదవశాత్తు ముగ్గురికి మంటలు అంటుకున్నాయి. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలియజేశారు.