*మంగళ గౌరీగా దర్శనమిచ్చిన అమ్మవారు*

కోదాడ, సెప్టెంబర్ 27(జనం సాక్షి)
కోదాడ పట్టణంలో వేంచేసియున్న శ్రీ ముద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో దేవీ నవరాత్రుల వేడుకలు ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. కాగా మంగళవారం రోజున అమ్మవారు భక్తులకు మంగళ గౌరీ అవతారంలో దర్శనమిచ్చారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఇటీవల ప్రతిష్టించిన అభయాంజనేయ స్వామి దేవాలయం వద్ద మంగళవారం  కావడంతో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు జూకూరి అంజయ్య, అన్నదాన నిర్వహకులు దేవరశెట్టి హనుమంతరావు అన్నదాతలు రామినేని భాస్కర్ రావు, రామడుగు శ్రీనివాసరావుఆలయ కమిటీ సభ్యులు కృష్ణమూర్తి ,సత్యం, బ్యాటరీ చారి ,వంశీకృష్ణ, అప్పారావు, వాసు తదితరులు పాల్గొన్నారు.
Attachments area