మంచినీటి ఎద్దడిపై శ్రద్ద ఏదీ

ఖమ్మం,మే7(జ‌నంసాక్షి):  వేసవి దృష్ట్యా జిల్లాలో అనేక ప్రాంతాల్లో మంచినీటి ఎద్దడి నెలకొందని, దీని నివారణకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఎం నేతలు అన్నారు. మంచినీటి సమస్యపై పార్టీతోపాటు ప్రజా సంఘాలు కూడా కలిసి పోరాడాలని కోరారు. ఉపాధి పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ఇబ్బందులు పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే

గ్రామాల్లో చెడిపోయిన బోర్లకు మరమ్మతులు చేయించటం, కుళాయిల ఏర్పాటు వంటి పనులు చేయించాలని కోరారు. పాలేరు నియోజకవర్గంలో  ఎన్నికల అనంతరం కూడా ప్రజాసేవకు అంకితమై పనిచేస్తారన్నారు.

నీతిమాలిన రాజకీయాలకు పాల్పడుతున్న తెరాసకు పాలేరు నియోజకవర్గ ఓటర్లు సరైన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.  తెరాస మాయమాటలకు పాలేరు ఓటర్లు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.

అభివృద్ధి పేరుతో వేలకోట్ల రూపాయలను తెరాస ప్రభుత్వం వృథాగా ఖర్చు చేస్తుందని ఆరోపించారు.  తెరాస ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నామంటూ పాలేరు లాంటి నీరే లేని ప్రాంతంలో నీరు తెప్పిస్తామని ఆర్భాటాలు చేస్తూ వేలకోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని ఆయన అన్నారు. కేసీఆర్‌ ఎన్నికలకు ముందు చేసిన వాగ్ధానాలలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని  విమర్శించారు. ప్రజల సమస్యల సాధనకు, నిత్యం ప్రజల కోసం పోరాడే పాలేరు నియోజకవర్గ సీపీఎం అభ్యర్థి పోతినేని సుదర్శన్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. ఏజెన్సీలో తునికాకు సేకరణ పనులు వెంటనే ప్రారంభించాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. తునికాకుకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. తునికాకు కార్మికులకు గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా వేధిస్తే ఊరుకునేది లేదని  అన్నారు.