మండల అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు ఇవ్వండి
తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 7:: తూప్రాన్ మండల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని తూప్రాన్ ఎంపీపీ గట్టి సప్న వెంకటేష్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు విజ్ఞప్తి చేశారు దసరా పండుగ అనంతరం ఆయనను కలిసిన సందర్భంగా ఆయనకు విన్నవించారు దసరా పండగను పురస్కరించుకొని ఈ రోజు మాన్యశ్రీ తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మరియు ఆర్థిక శాఖ మంత్రివర్యులు హరీష్ రావు నివాసానికి తూప్రాన్ ఎంపీపీ,మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరమ్ ఉపధ్యక్షురాలు గడ్డి స్వప్న వెంకటేష్ యాదవ్ వెళ్లి దసరా శుభాకాంక్షలు తెలియజేసినారు మరియు మండల అభివృద్ధి పనుల కోసం ప్రత్యేక ప్యాకేజి కేటాయించమని కోరినట్లు తెలిపారు పేద ప్రజలకు మండలం లోని అన్ని గ్రామాలలో డబుల్ బెడ్ రూమ్ లు మంజూరు చేయమని,గ్రామాలలో పెండింగ్ పనులకు నిధులు మంజూరి చేయమని కొరినారు అలాగే తూప్రాన్ సమీకృత ప్రభుత్వ కార్యాలయ భవన నిర్మాణ పనుల గురించి మంత్రిగారు ఎంపీపీ గారిని అడిగి తెలుసుకున్నారు మంత్రి గారికి పండగ శుభాకాంక్షలు తెలిపిన సందర్భంలో యవపూర్ ఎంపీటీసీ సంతోష్ రెడ్డి,మల్కాపూర్ ఎంపీటీసీ,సర్పంచ్ నవీన్ ఆంజనేయులు,ఘనపూర్ బిఆర్ స్ పార్టీ అధ్యక్షుడు వినోద్ కుమార్ వున్నారు
Attachments area