మండల కేంద్రంలో విఆర్ఏల రాస్తారోకో
పానుగల్ అక్టోబర్ 08,జనంసాక్షి
శనివారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ దగ్గర విఆర్ఏలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా విఆర్ఎల మండల అధ్యక్షులు సురేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు 76 రోజులుగా సమ్మె చేస్తూ, వేతనాలు లేక దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నామని,ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏలను ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించినట్లుగా వీఆర్ఏలకు వెంటనే పేస్కేల్ అమలు చేయాలని అదేవిధంగా అర్హత కలిగిన వీఆర్ఏలకు వెంటనే పదోన్నతులు కల్పించి,55సంవత్సరాలు దాటిన వీఆర్ఏలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏల వారసులకు ఉద్యోగభద్రత కల్పించాలని ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో వీఆర్ఏలు సునీత,వినోద,రామకృష్ణ,సికిందర్, మల్లేష్,వెంకటయ్య, అగ్గరయ్య తదితరులు పాల్గొన్నారు.